Iddarigi nichchadivi??? yirumelaam janavulu

ఇద్దరికి నిచ్చతివి??? యిరుమేలాఁ జనవులు
Language

(॥పల్లవి॥)
ఇద్దరికి నిచ్చతివి??? యిరుమేలాఁ జనవులు
వొద్దికై రతికి నన్నే వొడఁబరచేవు

(॥ఇద్ద॥)
సన్నలనే మోవితేనె చవులెల్లాఁ జూపె నాపె
చన్నులు దాఁకించి సరసములాడెను
యిన్నేసి నేరిచినది యింకా నేమి సేసునో
నన్నుఁ జూచి యీడ వచ్చి నవ్వులు నవ్వేవు

(॥ఇద్ద॥)
వాడికమాఁటలాడి వలపులు చల్లె నాపె
వేడుకతోఁ దా మరల వేసె నప్పటి
యీడనుండి యింత సేసె యేమి దలఁచుకున్నదో
వోడక నాతో పొందుల నోలలాడేవు

(॥ఇద్ద॥)
కందువకు వచ్చి నిన్ను కాఁగిలించుకొనె నాపె
సందడిఁ బాదము దొక్కి జంకించెను
అందపు శ్రీవేంకటేశ అలమేల్మంగను నేను
యిందు నిన్నేమనునో న న్నెనసి మన్నించేవు

(||pallavi||)
iddarigi nichchadivi??? yirumelām̐ janavulu
vŏddigai radigi nanne vŏḍam̐barasevu

(||idda||)
sannalane movidenĕ savulĕllām̐ jūbĕ nābĕ
sannulu dām̐kiṁchi sarasamulāḍĕnu
yinnesi nerisinadi yiṁkā nemi sesuno
nannum̐ jūsi yīḍa vachchi navvulu navvevu

(||idda||)
vāḍigamām̐ṭalāḍi valabulu sallĕ nābĕ
veḍugadom̐ dā marala vesĕ nappaḍi
yīḍanuṁḍi yiṁta sesĕ yemi dalam̐sugunnado
voḍaga nādo pŏṁdula nolalāḍevu

(||idda||)
kaṁduvagu vachchi ninnu kām̐giliṁchugŏnĕ nābĕ
saṁdaḍim̐ bādamu dŏkki jaṁkiṁchĕnu
aṁdabu śhrīveṁkaḍeśha alamelmaṁganu nenu
yiṁdu ninnemanuno na nnĕnasi manniṁchevu