ఇద్దరి తలఁపు లవె యింపు లవె మీలోన
(॥పల్లవి॥)
ఇద్దరి తలఁపు లవె యింపు లవె మీలోన-
నద్దిన కోరిక లవె అంపరాదా మమ్ము
(॥ఇద్ద॥)
నెలతరో నీవిదె నీవిభుఁ డల్లవాఁడె
పలికిన మామాఁటపట్లు నవె
తలఁపులుఁ దలఁపులుఁ దలకూడె మీలోని-
యలుక లిన్నియుఁ దీరె నంపరాదా మమ్ము
(॥ఇద్ద॥)
కప్పిన నీచూపు లవె కాంతునిరూప మదె
తెప్పలఁదేలేటిమీతెలుపు లవె
వొప్పన సేసితిమి మిమ్మొకరొకరిని మీకే
అప్పుడే చలము చెల్లె నంపరాదా మమ్ము
(॥ఇద్ద॥)
చిమ్ములనీచేతు లవె శ్రీవేంకటపతి-
కమ్మినతమకమలకాఁగి లదె
దొమ్మిగాఁ గూడితి రిట్టె దోమతెరమంచములో
అమ్ముడుజీతము లాయ నంపరాదా మమ్ము
(||pallavi||)
iddari talam̐pu lavĕ yiṁpu lavĕ mīlona-
naddina koriga lavĕ aṁparādā mammu
(||idda||)
nĕladaro nīvidĕ nīvibhum̐ ḍallavām̐ḍĕ
paligina māmām̐ṭabaṭlu navĕ
talam̐pulum̐ dalam̐pulum̐ dalagūḍĕ mīloni-
yaluga linniyum̐ dīrĕ naṁparādā mammu
(||idda||)
kappina nīsūbu lavĕ kāṁtunirūba madĕ
tĕppalam̐deleḍimīdĕlubu lavĕ
vŏppana sesidimi mimmŏgarŏgarini mīge
appuḍe salamu sĕllĕ naṁparādā mammu
(||idda||)
simmulanīsedu lavĕ śhrīveṁkaḍabadi-
kamminadamagamalagām̐gi ladĕ
dŏmmigām̐ gūḍidi riṭṭĕ domadĕramaṁchamulo
ammuḍujīdamu lāya naṁparādā mammu