ఇద్దరి నేలేననీఁ బో యెనయదమ్మా యీ
(॥పల్లవి॥)
ఇద్దరి నేలేననీఁ బో యెనయదమ్మా యీ
సుద్దులేల యీడకే తాఁ జొచ్చి రానీవమ్మా
(॥ఇద్దరి॥)
ఒప్పుగనాకెను నన్నునొక్కటిసేయఁ బనిచీ
వుప్పులోఁ గప్పురమేల వొద్దమ్మా
అప్పటి నావుసురుల నాకెవుసురులఁ దన్ను
దప్పిదేర విసరేయు తనకేమోయమ్మా
(॥ఇద్దరి॥)
మూలనాకెచేత నాకు మొక్కించఁ బలిచీని
పాలలోనఁ బులుసేల పదవమ్మా
ఆలి నామైకాఁక నాకెమేని కాఁకలను
కాలపువరుసఁ జలిగాయిమనమ్మా
(॥ఇద్దరి॥)
తానాకె మానితినని తారుకాణించఁ బిలిచీ
తేనెలోనఁ దీపులేల తెలిసెనమ్మా
పూని శ్రీవేంకటతి బుజ్జగించి నన్నుఁగూడె
తానె యాకెఁజూపెనిందాఁక సటకమ్మా
(||pallavi||)
iddari nelenanīm̐ bo yĕnayadammā yī
suddulela yīḍage tām̐ jŏchchi rānīvammā
(||iddari||)
ŏppuganāgĕnu nannunŏkkaḍiseyam̐ banisī
vuppulom̐ gappuramela vŏddammā
appaḍi nāvusurula nāgĕvusurulam̐ dannu
dappidera visareyu tanagemoyammā
(||iddari||)
mūlanāgĕseda nāgu mŏkkiṁcham̐ balisīni
pālalonam̐ bulusela padavammā
āli nāmaigām̐ka nāgĕmeni kām̐kalanu
kālabuvarusam̐ jaligāyimanammā
(||iddari||)
tānāgĕ mānidinani tārugāṇiṁcham̐ bilisī
tenĕlonam̐ dībulela tĕlisĕnammā
pūni śhrīveṁkaḍadi bujjagiṁchi nannum̐gūḍĕ
tānĕ yāgĕm̐jūbĕniṁdām̐ka saḍagammā