ఇద్దరి కోరికలును యేకమౌత గంటిమి
(॥పల్లవి॥)
ఇద్దరి కోరికలును యేకమౌత గంటిమి
పొద్దున విచ్చేయవయ్యా పొందు లొనగూడెను
(॥ఇద్ద॥)
వెలయ నేఁ జేసినవిన్నపాలెల్లా వింటివి
యెలమితో వచ్చేనని యియ్యకొంటివి
తలంచుక యేపొద్దూఁ జిత్తానఁ బెట్టుకుండవయ్య
చెలియతో నన్నియునుఁ జెప్పవచ్చే మిఁకను
(॥ఇద్ద॥)
కైకొని సతియంపినకానుక లందుకొంటివి
ఆకెకు నీవుడుగర లంపితివి
జొకతో సింగారించు కచ్చొటి కిట్టె రావయ్య
సేకరకముగానీరాక చెప్పివచ్చే మిఁకను
(॥ఇద్ద॥)
మావెంటనే వచ్చినీవు మగువతోఁ గూడితివి
దేవులాయ నీకు నాపె తెల్లమిగాను
యీవల విందాయితము యింట్లోఁ జేసీ నీకు
శ్రీవేంకటేశ నీయింపు చెప్పివచ్చే మిఁకను
(||pallavi||)
iddari korigalunu yegamauda gaṁṭimi
pŏdduna vichcheyavayyā pŏṁdu lŏnagūḍĕnu
(||idda||)
vĕlaya nem̐ jesinavinnabālĕllā viṁṭivi
yĕlamido vachchenani yiyyagŏṁṭivi
talaṁchuga yebŏddūm̐ jittānam̐ bĕṭṭuguṁḍavayya
sĕliyado nanniyunum̐ jĕppavachche mim̐kanu
(||idda||)
kaigŏni sadiyaṁpinagānuga laṁdugŏṁṭivi
āgĕgu nīvuḍugara laṁpidivi
jŏgado siṁgāriṁchu kachchŏḍi kiṭṭĕ rāvayya
segaragamugānīrāga sĕppivachche mim̐kanu
(||idda||)
māvĕṁṭane vachchinīvu maguvadom̐ gūḍidivi
devulāya nīgu nābĕ tĕllamigānu
yīvala viṁdāyidamu yiṁṭlom̐ jesī nīgu
śhrīveṁkaḍeśha nīyiṁpu sĕppivachche mim̐kanu