Iddari kiddare sari yeedugu jodugum dagu

ఇద్దరి కిద్దరే సరి యీడుకు జోడుకుఁ దగు
Language

(॥పల్లవి॥)
ఇద్దరి కిద్దరే సరి యీడుకు జోడుకుఁ దగు
గద్దరికన్నులఁ జూడఁగలిగెఁగా మనకు

(॥ఇద్ద॥)
పంతపు చెలిచన్నులు పసిఁడికాంతులకు
కాంతునిపీతాంబరపు కాంతులు సిరి
దొంతుల చెలినీలపుతురుము కాంతులకు
వంతుల మేనినీవర్ణము సరి

(॥ఇద్ద॥)
జలజాక్షివెలలేని జఘనచక్రమునకు
చలమరివలకేలిచక్రము సరి
కులికేటి యీయింతికుత్తికశంఖమునకు
చలివాయ రమణునిశంఖము సరి

(॥ఇద్ద॥)
కమలాక్షి శ్రీవేంకటపతిఁ గూడుటకు
రమణుఁడంటిన సమరతులు సరి
తమితోడ నిద్దరిక తారుకాణలై నట్టి -
సముకపు మోహముల సంతసములు సరి

(||pallavi||)
iddari kiddare sari yīḍugu joḍugum̐ dagu
gaddarigannulam̐ jūḍam̐galigĕm̐gā managu

(||idda||)
paṁtabu sĕlisannulu pasim̐ḍigāṁtulagu
kāṁtunibīdāṁbarabu kāṁtulu siri
dŏṁtula sĕlinīlabudurumu kāṁtulagu
vaṁtula meninīvarṇamu sari

(||idda||)
jalajākṣhivĕlaleni jaghanasakramunagu
salamarivalagelisakramu sari
kuligeḍi yīyiṁtiguttigaśhaṁkhamunagu
salivāya ramaṇuniśhaṁkhamu sari

(||idda||)
kamalākṣhi śhrīveṁkaḍabadim̐ gūḍuḍagu
ramaṇum̐ḍaṁṭina samaradulu sari
tamidoḍa niddariga tārugāṇalai naṭṭi -
samugabu mohamula saṁtasamulu sari