ఇద్దరి భావములును యేమని విన్నవించేము
(॥పల్లవి॥)
ఇద్దరి భావములును యేమని విన్నవించేము
అద్దుకొన్న ప్రియుములు ఆయములు సోఁకెను
(॥ఇద్ద॥)
చెక్కుచేతితోడనే చెలి నిన్నుఁ జూడఁగాను
చిక్కనిచెమటలెల్లా చేర నిండెను
నెక్కొని యంతవట్టును నీమీఁద నేఁ జల్లితేను
వెక్కసమై పులకలు వెదకు మెలచెను
(॥ఇద్ద॥)
సయ్యదముసుఁగుతోడ పడఁతి నీతో నవ్వితే
వొయ్యనే కొప్పువిరులు వొడి నిండెను
నెయ్యపువేడుకతోడ నీమీఁద నవి చల్లితే
ముయ్యరానికళలెల్లా మోమున వెలసెను
(॥ఇద్ద॥)
చన్ను లురమున మోవ పతి నిన్నుఁ గూడితేను
వున్నతి మోవిఁ దేనె లుబ్బి నిండెను
యెన్నఁగ శ్రీవేంకటేశ యివి నీమోవిఁ జల్లితే
తిన్ననియానందము దేహాన నిలిచెను
(||pallavi||)
iddari bhāvamulunu yemani vinnaviṁchemu
addugŏnna priyumulu āyamulu som̐kĕnu
(||idda||)
sĕkkusedidoḍane sĕli ninnum̐ jūḍam̐gānu
sikkanisĕmaḍalĕllā sera niṁḍĕnu
nĕkkŏni yaṁtavaṭṭunu nīmīm̐da nem̐ jallidenu
vĕkkasamai pulagalu vĕdagu mĕlasĕnu
(||idda||)
sayyadamusum̐gudoḍa paḍam̐ti nīdo navvide
vŏyyane kŏppuvirulu vŏḍi niṁḍĕnu
nĕyyabuveḍugadoḍa nīmīm̐da navi sallide
muyyarānigaḽalĕllā momuna vĕlasĕnu
(||idda||)
sannu luramuna mova padi ninnum̐ gūḍidenu
vunnadi movim̐ denĕ lubbi niṁḍĕnu
yĕnnam̐ga śhrīveṁkaḍeśha yivi nīmovim̐ jallide
tinnaniyānaṁdamu dehāna nilisĕnu