Iddaramu nunnaaramu yirudikkulaa neegu

ఇద్దరము నున్నారము యిరుదిక్కులా నీకు
Language

(॥పల్లవి॥)
ఇద్దరము నున్నారము యిరుదిక్కులా నీకు
పెద్దరికముతోడనే పెనఁగఁగవలెను

(॥॥)
ఆకె నొడఁబరమకో అంకెకు వచ్చినదాఁకా
నాకేమి చెప్పేవు నమ్మినదాన
శేకరమాయ వలపు సిగ్గులు వడితేఁ బోదు
చేకొలఁదిఁ బ్రియములు చెప్పవలె నిఁకను

(॥॥)
పూని యాకెనే నీవు బుజ్జగించి పిలుచుకో
నేనెప్పుడుఁ దొలుతనే నాదానను
నానాఁడే పెండ్లాడి నవ్వులు నవ్వితేఁ బోదు
తేనేమోవి యిచ్చి తరితీపు చూపవలెను

(॥॥)
యింటిలో నాకెఁ గూడితి విందాఁకాఁ గాఁగిట నించు
జంటయి నేఁ గూడితి నిచ్చకపుదాన
వెంటనే శ్రీవేంకటేశ వేసాలు నేసితేఁ బోదు
అంటువాయ కిట్లానే ఆదరించరాదా

(||pallavi||)
iddaramu nunnāramu yirudikkulā nīgu
pĕddarigamudoḍane pĕnam̐gam̐gavalĕnu

(||||)
āgĕ nŏḍam̐baramago aṁkĕgu vachchinadām̐kā
nāgemi sĕppevu namminadāna
śhegaramāya valabu siggulu vaḍidem̐ bodu
segŏlam̐dim̐ briyamulu sĕppavalĕ nim̐kanu

(||||)
pūni yāgĕne nīvu bujjagiṁchi pilusugo
nenĕppuḍum̐ dŏludane nādānanu
nānām̐ḍe pĕṁḍlāḍi navvulu navvidem̐ bodu
tenemovi yichchi taridību sūbavalĕnu

(||||)
yiṁṭilo nāgĕm̐ gūḍidi viṁdām̐kām̐ gām̐giḍa niṁchu
jaṁṭayi nem̐ gūḍidi nichchagabudāna
vĕṁṭane śhrīveṁkaḍeśha vesālu nesidem̐ bodu
aṁṭuvāya kiṭlāne ādariṁcharādā