ఇద్దరము నున్నారము యెవ్వరి మగఁడవయ్యా
(॥పల్లవి॥)
ఇద్దరము నున్నారము యెవ్వరి మగఁడవయ్యా
వొద్దికఁ బందేలు వేసుకొ(కు?)న్నార మిపుడు
(॥ఇద్ద॥)
హత్తి నేము తగవు నిన్నడుగఁగవచ్చితేను
పొత్తులమాట లాడి పొదిపేవు
ఇత్తల నీవే కావా ఇంతసేసినవాఁడవు
బత్తిగలవాఁడు వలె పరాకు సేసేవు
(॥ఇద్ద॥)
జంట నొకరొకరము చనవులు మెరసితే
యింటిలోనే సరిగాను యింపు చల్లేవు
రెంటికి గురై వలపురేఁచినవాఁడవు నీవే
అంటి ఆయములుముట్టి ఆసలు చూపేవు
(॥ఇద్ద॥)
వరుస నే మొకమాటే వావులు నీకుఁ జెప్పితే
కెరలి మమ్మిపుడే కాఁగిటఁ గూడేవు
నిరతి శ్రీవేంకటేశ నీవే తగిలితివి
పరగ నాపై మన్ననే పచారించేవు
(||pallavi||)
iddaramu nunnāramu yĕvvari magam̐ḍavayyā
vŏddigam̐ baṁdelu vesugŏ(ku?)nnāra mibuḍu
(||idda||)
hatti nemu tagavu ninnaḍugam̐gavachchidenu
pŏttulamāḍa lāḍi pŏdibevu
ittala nīve kāvā iṁtasesinavām̐ḍavu
battigalavām̐ḍu valĕ parāgu sesevu
(||idda||)
jaṁṭa nŏgarŏgaramu sanavulu mĕraside
yiṁṭilone sarigānu yiṁpu sallevu
rĕṁṭigi gurai valaburem̐sinavām̐ḍavu nīve
aṁṭi āyamulumuṭṭi āsalu sūbevu
(||idda||)
varusa ne mŏgamāḍe vāvulu nīgum̐ jĕppide
kĕrali mammibuḍe kām̐giḍam̐ gūḍevu
niradi śhrīveṁkaḍeśha nīve tagilidivi
paraga nābai mannane pasāriṁchevu