Iddaramu nunnaaramu yemduvoyyemu

ఇద్దరము నున్నారము యెందువొయ్యేము
Language

(॥పల్లవి॥)
ఇద్దరము నున్నారము యెందువొయ్యేము
తిద్దువడ్డ ననుపులే తెమలించీఁగాక

(॥ఇద్ద॥)
సారెసారె నీతోను చలము సాదించనేల
కూరిములే కలిగితే కూరిచీఁగాక
కారములుగా నిన్ను గంటెసాలాడఁగనేల
పేరడైతేఁ దమకము పెడరేఁచీఁగాక

(॥ఇద్ద॥)
పొలసిపొలసి నిన్ను బొమ్మల జంకించనేల
చిలుకుఁజూపులే పెండ్లినేసీఁగాక
వులివచ్చిచెనకుల నొత్తడిపెట్టఁగనేల
తలఁగరానిమర్మాలే తలఁపించీఁగాక

(॥ఇద్ద॥)
పెనఁగిపెనఁగి మేను బెండుపరచఁగనేల
చను మొనలే నిన్ను నెచ్చరించీఁగాక
యొనసితివి శ్రీవేంకటేశుఁడ కొసరఁగనేల
తనివోనిమోవితేనె దప్పిదేర్చీఁగాక

(||pallavi||)
iddaramu nunnāramu yĕṁduvŏyyemu
tidduvaḍḍa nanubule tĕmaliṁchīm̐gāga

(||idda||)
sārĕsārĕ nīdonu salamu sādiṁchanela
kūrimule kaligide kūrisīm̐gāga
kāramulugā ninnu gaṁṭĕsālāḍam̐ganela
peraḍaidem̐ damagamu pĕḍarem̐sīm̐gāga

(||idda||)
pŏlasibŏlasi ninnu bŏmmala jaṁkiṁchanela
silugum̐jūbule pĕṁḍlinesīm̐gāga
vulivachchisĕnagula nŏttaḍibĕṭṭam̐ganela
talam̐garānimarmāle talam̐piṁchīm̐gāga

(||idda||)
pĕnam̐gibĕnam̐gi menu bĕṁḍubarasam̐ganela
sanu mŏnale ninnu nĕchchariṁchīm̐gāga
yŏnasidivi śhrīveṁkaḍeśhum̐ḍa kŏsaram̐ganela
tanivonimovidenĕ dappidersīm̐gāga