Iddaramu nokkade imteshaaloyi

ఇద్దరము నొక్కటే ఇంతేశాలోయి
Language

(॥పల్లవి॥)
ఇద్దరము నొక్కటే ఇంతేశాలోయి
తిద్దుకొని యల్లుకొంటే తీగెలే పొదలుగావా

(॥ఇద్ద॥)
చలము సాదించితేను చట్రాయి నుగ్గులౌను
యిల గోరగీరితేను యేరైపారు
వలపు రేఁచవచ్చేవు వద్దు సుమ్మీ వయి నీవు
మొలకలే పెరిగితే మూకమాకులుగావా

(॥ఇద్ద॥)
పంతములాడుకొంటేను బయలెల్లా బందితౌను
చింతించితేను మంచము చెంతనే నుయ్య
యెంత చెనకవచ్చేవు యేఁటికోయి వేసాలు
అంతటా పూపలైతేనే యట్టె పిందెలు గావా

(॥ఇద్ద॥)
కోరికలు వెంచితేను కోటానఁగోట్లౌను
పేరఁబెట్టితే పాలే పరుగౌను
యారీతి శ్రీవేంకటేశ యేలితివి నన్ను నేఁడు
నేరుపింత గలిగితే నీవే నేఁగానా

(||pallavi||)
iddaramu nŏkkaḍe iṁteśhāloyi
tiddugŏni yallugŏṁṭe tīgĕle pŏdalugāvā

(||idda||)
salamu sādiṁchidenu saṭrāyi nuggulaunu
yila goragīridenu yeraibāru
valabu rem̐savachchevu vaddu summī vayi nīvu
mŏlagale pĕrigide mūgamāgulugāvā

(||idda||)
paṁtamulāḍugŏṁṭenu bayalĕllā baṁdidaunu
siṁtiṁchidenu maṁchamu sĕṁtane nuyya
yĕṁta sĕnagavachchevu yem̐ṭigoyi vesālu
aṁtaḍā pūbalaidene yaṭṭĕ piṁdĕlu gāvā

(||idda||)
korigalu vĕṁchidenu koḍānam̐goṭlaunu
peram̐bĕṭṭide pāle parugaunu
yārīdi śhrīveṁkaḍeśha yelidivi nannu nem̐ḍu
nerubiṁta galigide nīve nem̐gānā