ఇతవరులమయ్యే నిన్నింతకుఁ దెచ్చితిమి
(॥పల్లవి॥)
ఇతవరులమయ్యే నిన్నింతకుఁ దెచ్చితిమి
కతలకెల్ల నిక్కిన కడు దొడ్డవాఁడవు
(॥ఇత॥)
చేరి నిన్నుఁ గూడేమంటా చెమట లంటింతుము
మేరతో కొప్పువిరులు మీఁద రాలును
యీరీతి మాతోడి పొందు ఇంతకుఁ దెచ్చెను నిన్ను
పోరచి నందరిచేత పూజగొనేవాఁడవు
(॥ఇత॥)
మోవి తేనెలిచ్చేమంటా ముంచి యెంగిలి సేతుము
భావించి పెనఁగఁబోతే పాదాలు సోఁకు
వావులు మాతోడను వాఁటాలు సేసెను నిన్ను
దేవరవై ఇందరిలో తేజమైన వాఁడవు
(॥ఇత॥)
రతుల మెప్పించేమంటా రసము లుబ్బింతుము
చతురత మాటలెల్లా సాదింపు లౌను
ఇతవై శ్రీ వేంకటేశ ఇటు నన్నుఁ గూడితివి
సతులు పెక్కులు గల సవరనివాఁ డవు
(||pallavi||)
idavarulamayye ninniṁtagum̐ dĕchchidimi
kadalagĕlla nikkina kaḍu dŏḍḍavām̐ḍavu
(||ida||)
seri ninnum̐ gūḍemaṁṭā sĕmaḍa laṁṭiṁtumu
merado kŏppuvirulu mīm̐da rālunu
yīrīdi mādoḍi pŏṁdu iṁtagum̐ dĕchchĕnu ninnu
porasi naṁdariseda pūjagŏnevām̐ḍavu
(||ida||)
movi tenĕlichchemaṁṭā muṁchi yĕṁgili sedumu
bhāviṁchi pĕnam̐gam̐bode pādālu som̐ku
vāvulu mādoḍanu vām̐ṭālu sesĕnu ninnu
devaravai iṁdarilo tejamaina vām̐ḍavu
(||ida||)
radula mĕppiṁchemaṁṭā rasamu lubbiṁtumu
sadurada māḍalĕllā sādiṁpu launu
idavai śhrī veṁkaḍeśha iḍu nannum̐ gūḍidivi
sadulu pĕkkulu gala savaranivām̐ ḍavu