Idaramu lede yimti nee padigi

ఇతరము లేదే యింతి నీ పతికి
Language

(॥పల్లవి॥)
ఇతరము లేదే యింతి నీ పతికి
ప్రతిదినదినమును ప్రభాతవేళ

(॥ఇత॥)
అంగన నీమోము అద్దము విభునికి
కంగుదేరి మేల్కనువేళ
పొంగేటికుచములే పూర్ణకుంభములు
వింగళమై వెలివెడలెఁడివేళ

(॥ఇత॥)
అతివ నీతొడలే యరఁటికంభములు
చతురునికిఁ బ్రవేశపువేళ
రతిఁగరములే తోరణపుఁజిగు రలరె
అతనుముహూర్తపు టావేళ

(॥ఇత॥)
సుదతి నీకెమ్మోవి సూడిదెఫల మిది
అదన మీరహస్యపువేళ
కదిసిన శ్రీవేంకటపతికిని నీ -
వెదిటివిధానమ వెప్పటివేళ

(||pallavi||)
idaramu lede yiṁti nī padigi
pradidinadinamunu prabhādaveḽa

(||ida||)
aṁgana nīmomu addamu vibhunigi
kaṁguderi melganuveḽa
pŏṁgeḍigusamule pūrṇaguṁbhamulu
viṁgaḽamai vĕlivĕḍalĕm̐ḍiveḽa

(||ida||)
adiva nīdŏḍale yaram̐ṭigaṁbhamulu
sadurunigim̐ braveśhabuveḽa
radim̐garamule toraṇabum̐jigu ralarĕ
adanumuhūrdabu ṭāveḽa

(||ida||)
sudadi nīgĕmmovi sūḍidĕphala midi
adana mīrahasyabuveḽa
kadisina śhrīveṁkaḍabadigini nī -
vĕdiḍividhānama vĕppaḍiveḽa