Idameemda neevu mari yemisesevu

ఇటమీఁద నీవు మరి యేమిసేసేవు
Language

(॥పల్లవి॥)
ఇటమీఁద నీవు మరి యేమిసేసేవు
చిటుకన నేమే అక్కచెల్లెండ్ల మైతిమి

(॥ఇట॥)
తతిగొని చెప్పేవు తగవులు నీకు నీవే
యితవరివలెనే యీకెకు నాకు
మతకారివాఁడవు నీ మర్మము నేనెఱుఁగుదు
సతుల మిద్దరమును సంతమైతి మిపుడు

(॥ఇట॥)
నెట్టుకొని సాకిరై నిలిచేవు నీవే వచ్చి
చుట్టము వలెనే వుండి సారిది మాకు
గుట్టువాయవాఁడవు నీ కతలు నే నెఱుఁగుదు
గుట్టున బాసలు సేనుకొంటిమి నే నిపుడు

(॥ఇట॥)
యీవేళ పొందులు విడే లిచ్చేవు చేత నీవే
భావ మరఁటివలెనే పైపై నీవు
శ్రీవేంకటేశ్వరుని చత్తము నేనెఱుఁగుదును
యీవర సవతులమై యీడేరితిమిపుడు

(||pallavi||)
iḍamīm̐da nīvu mari yemisesevu
siḍugana neme akkasĕllĕṁḍla maidimi

(||iḍa||)
tadigŏni sĕppevu tagavulu nīgu nīve
yidavarivalĕne yīgĕgu nāgu
madagārivām̐ḍavu nī marmamu nenĕṟum̐gudu
sadula middaramunu saṁtamaidi mibuḍu

(||iḍa||)
nĕṭṭugŏni sāgirai nilisevu nīve vachchi
suṭṭamu valĕne vuṁḍi sāridi māgu
guṭṭuvāyavām̐ḍavu nī kadalu ne nĕṟum̐gudu
guṭṭuna bāsalu senugŏṁṭimi ne nibuḍu

(||iḍa||)
yīveḽa pŏṁdulu viḍe lichchevu seda nīve
bhāva maram̐ṭivalĕne paibai nīvu
śhrīveṁkaḍeśhvaruni sattamu nenĕṟum̐gudunu
yīvara savadulamai yīḍeridimibuḍu