Ida taravaadi panulellaa nee sedivi

ఇట తరవాతి పనులెల్లా నీ చేతివి
Language

(॥పల్లవి॥)
ఇట తరవాతి పనులెల్లా నీ చేతివి
యెటువలె మన్నించినా నితవే నాకు

(॥ఇట॥)
వేవేలుగా గొసరితి విన్నపము సేసితి
నీ వేమి సేసినా మేలే నీ చిత్తము
వావులెల్లాఁ దెలిపితి వాడికల మెలఁగితి
భావించి నీ యాలనౌటే పదివేలు నాకును

(॥ఇట॥)
చేతులెత్తి మొక్కితి చిత్తము గరఁగించితి
నీ తలఁపెట్టున్నా మేలే నీ చిత్తము
కాతరాన వలచితి కన్నుల నిన్నుఁ జూచితి
ఆతుమలో నీ వుండుటే అన్ని యీవులు నాకు

(॥ఇట॥)
కాఁపురాలు సేసితి కంకణము గట్టుకొంటి
నీ పొందు లన్నియు మేలే నీ చిత్తము
యేపున శ్రీవేంకటేశ యిట్టె నన్ను నేలితివి
కాపాడేటి నీ కరుణ ఘన సంపద నాకు

(||pallavi||)
iḍa taravādi panulĕllā nī sedivi
yĕḍuvalĕ manniṁchinā nidave nāgu

(||iḍa||)
vevelugā gŏsaridi vinnabamu sesidi
nī vemi sesinā mele nī sittamu
vāvulĕllām̐ dĕlibidi vāḍigala mĕlam̐gidi
bhāviṁchi nī yālanauḍe padivelu nāgunu

(||iḍa||)
sedulĕtti mŏkkidi sittamu garam̐giṁchidi
nī talam̐pĕṭṭunnā mele nī sittamu
kādarāna valasidi kannula ninnum̐ jūsidi
ādumalo nī vuṁḍuḍe anni yīvulu nāgu

(||iḍa||)
kām̐purālu sesidi kaṁkaṇamu gaṭṭugŏṁṭi
nī pŏṁdu lanniyu mele nī sittamu
yebuna śhrīveṁkaḍeśha yiṭṭĕ nannu nelidivi
kābāḍeḍi nī karuṇa ghana saṁpada nāgu