ఇచ్చితివా కానికె తా నేమనీనే
(॥పల్లవి॥)
ఇచ్చితివా కానికె తా నేమనీనే
తచ్చి తచ్చి తనమాఁట దలఁచుకొమ్మనవే
(॥ఇచ్చి॥)
చిగిరించెఁ జిత్తము చెమరించె నామేను
యెగెసక్కెపు విభుఁడు యేమనీనే
నగవులాయ వలపు నావంటివారిలోనెల్లా
తగవైన తనబాస తలఁచుకొమ్మనవే
(॥ఇచ్చి॥)
చిమ్మిరేఁగే వయసుచే చేవదేరీ నాయాసలు
యెమ్మెలరమణుఁడు తానేమనీనే
వుమ్మడి నున్నది గుట్టు వూరెల్లాఁబెనురట్టు
తమ్మిరేకు తనవాఁ(వ్రా?) త తలఁచుకొమ్మనవే
(॥ఇచ్చి॥)
వెలిఁబడె సిగ్గులు వెరగాయరతులు
యెలమి శ్రీ వేంకటేశుఁ డేమనీనే
కలసెఁ దనకు నాకు కాఁగిటనే వావులు
తలపోసి యీ చేఁతలు తలఁచుకొమ్మనవే
(||pallavi||)
ichchidivā kānigĕ tā nemanīne
tachchi tachchi tanamām̐ṭa dalam̐sugŏmmanave
(||ichchi||)
sigiriṁchĕm̐ jittamu sĕmariṁchĕ nāmenu
yĕgĕsakkĕbu vibhum̐ḍu yemanīne
nagavulāya valabu nāvaṁṭivārilonĕllā
tagavaina tanabāsa talam̐sugŏmmanave
(||ichchi||)
simmirem̐ge vayasuse sevaderī nāyāsalu
yĕmmĕlaramaṇum̐ḍu tānemanīne
vummaḍi nunnadi guṭṭu vūrĕllām̐bĕnuraṭṭu
tammiregu tanavām̐(vrā?) ta talam̐sugŏmmanave
(||ichchi||)
vĕlim̐baḍĕ siggulu vĕragāyaradulu
yĕlami śhrī veṁkaḍeśhum̐ ḍemanīne
kalasĕm̐ danagu nāgu kām̐giḍane vāvulu
talabosi yī sem̐talu talam̐sugŏmmanave