Ichcherimgi sevalu seyimchugovadaa

ఇచ్చెరిఁగి సేవలు సేయించుకోవదా
Language

(॥పల్లవి॥)
ఇచ్చెరిఁగి సేవలు సేయించుకోవదా
మచ్చికతోడ నన్ను మన్నించేవాఁడవు

(॥ఇచ్చె॥)
నిద్దిరించేవేళ నన్ను నీవేల లేపితివి
వొద్దఁ గాచుకున్నసతి యుండఁగాను
అద్దుకొని నాపై బత్తి అంత నీకుఁ గలిగితే
అద్దమరాతిరిదాఁకా నలయించవలెనా

(॥ఇచ్చె॥)
తొడ చరచి నన్నేల అడిగేవు విడెము
అడపమువనిత నీ కందియ్యఁగా
కడుఁదమకము నాపైఁ గలవాఁడవై తేను
అడియాసలఁ బెట్టి నన్నలయించవలెనా

(॥ఇచ్చె॥)
బలిమిచేసి నన్నెంత పచ్చిచేసి కూడితివి
అలమేల్మంగ నీవురమందు నుండఁగా
యెలమి శ్రీవేంకటేశ యిద్దరము నితవైతే
అలవోకగా నన్ను నలయించవలెనా

(||pallavi||)
ichchĕrim̐gi sevalu seyiṁchugovadā
machchigadoḍa nannu manniṁchevām̐ḍavu

(||ichchĕ||)
niddiriṁcheveḽa nannu nīvela lebidivi
vŏddam̐ gāsugunnasadi yuṁḍam̐gānu
addugŏni nābai batti aṁta nīgum̐ galigide
addamarādiridām̐kā nalayiṁchavalĕnā

(||ichchĕ||)
tŏḍa sarasi nannela aḍigevu viḍĕmu
aḍabamuvanida nī kaṁdiyyam̐gā
kaḍum̐damagamu nābaim̐ galavām̐ḍavai tenu
aḍiyāsalam̐ bĕṭṭi nannalayiṁchavalĕnā

(||ichchĕ||)
balimisesi nannĕṁta pachchisesi kūḍidivi
alamelmaṁga nīvuramaṁdu nuṁḍam̐gā
yĕlami śhrīveṁkaḍeśha yiddaramu nidavaide
alavogagā nannu nalayiṁchavalĕnā