ఇచ్చకురాలఁ దొలుతే యేఁటికి లోఁగే నేను
(॥పల్లవి॥)
ఇచ్చకురాలఁ దొలుతే యేఁటికి లోఁగే నేను
నిచ్చ నాతో సరసము నేఁడుగాక యెన్నఁడే
(॥ఇచ్చ॥)
వొత్తి గుబ్బులు విసికీ వొద్దన్నా మానఁడు
చిత్తము వచ్చినయట్టు సేయుమనవే
హత్తి వలచినదాన నౌఁగాదనఁగరాదు
తత్తరపావయసు తన సొమ్ము గాదా
(॥ఇచ్చ॥)
లవి మోవి పిప్పిసేసీ లావణ్య మొఱఁగఁడు
అలరి తా నాడినదే ఆట యననే
కులమునాలను తనకోరిక మానువరాదు
తలఁప నాభావమెల్లా తనసొమ్ము గాదా
(॥ఇచ్చ॥)
మనసు గరఁగించీని మట్టుతోడ నిలుపఁడు
యెనసినాఁ డిఁక దనయిచ్చ యనవే
అనుగు శ్రీవేంకటేశు కడ్డమాడఁగాదు
తనరి నాసంతోసము తనసొమ్మగాదా
(||pallavi||)
ichchagurālam̐ dŏlude yem̐ṭigi lom̐ge nenu
nichcha nādo sarasamu nem̐ḍugāga yĕnnam̐ḍe
(||ichcha||)
vŏtti gubbulu visigī vŏddannā mānam̐ḍu
sittamu vachchinayaṭṭu seyumanave
hatti valasinadāna naum̐gādanam̐garādu
tattarabāvayasu tana sŏmmu gādā
(||ichcha||)
lavi movi pippisesī lāvaṇya mŏṟam̐gam̐ḍu
alari tā nāḍinade āḍa yanane
kulamunālanu tanagoriga mānuvarādu
talam̐pa nābhāvamĕllā tanasŏmmu gādā
(||ichcha||)
manasu garam̐giṁchīni maṭṭudoḍa nilubam̐ḍu
yĕnasinām̐ ḍim̐ka danayichcha yanave
anugu śhrīveṁkaḍeśhu kaḍḍamāḍam̐gādu
tanari nāsaṁtosamu tanasŏmmagādā