ఇచ్చకురాల నీకు నింత సేసేనా
(॥పల్లవి॥)
ఇచ్చకురాల నీకు నింత సేసేనా
అచ్చువలె నుండ నిన్ను నంత సేసేనా
(॥ఇచ్చ॥)
తగవులఁబెట్టె నాపె తమకించి తిట్టె నాపె
యెగసక్కేన నేనైతే యింత సే సేనా
నగుతానే వద్దనుండి నాయము దీర్చితిఁగాక
అగపడ్డనిన్ను రట్టు అంత సే సేనా
(॥ఇచ్చ॥)
సన్నలు సేసె నాపె చలము సాదించె నాపె
యెన్నికలుగా నిన్ను యింత సే సేనా
పన్ని నే నడుమ నిన్నుఁ బట్టుక వుండితిఁగాక
అన్నిటా నాపెకు లోనై అంత సే సేనా
(॥ఇచ్చ॥)
కఱకఱిఁ బెట్టె నాపె కాఁగిలించుకొనె నాపె
యెఱవులు చూపి నిన్ను నంత సే సేనూ
వెఱవు తోడుతను శ్రీ వేంకటేశ నేఁగూడితి
అఱలేక చొక్కి నిన్ను నంత సే సేనా
(||pallavi||)
ichchagurāla nīgu niṁta sesenā
achchuvalĕ nuṁḍa ninnu naṁta sesenā
(||ichcha||)
tagavulam̐bĕṭṭĕ nābĕ tamagiṁchi tiṭṭĕ nābĕ
yĕgasakkena nenaide yiṁta se senā
nagudāne vaddanuṁḍi nāyamu dīrsidim̐gāga
agabaḍḍaninnu raṭṭu aṁta se senā
(||ichcha||)
sannalu sesĕ nābĕ salamu sādiṁchĕ nābĕ
yĕnnigalugā ninnu yiṁta se senā
panni ne naḍuma ninnum̐ baṭṭuga vuṁḍidim̐gāga
anniḍā nābĕgu lonai aṁta se senā
(||ichcha||)
kaṟagaṟim̐ bĕṭṭĕ nābĕ kām̐giliṁchugŏnĕ nābĕ
yĕṟavulu sūbi ninnu naṁta se senū
vĕṟavu toḍudanu śhrī veṁkaḍeśha nem̐gūḍidi
aṟalega sŏkki ninnu naṁta se senā