Ichchagamule sesi yeederavalemgaaga

ఇచ్చకములే సేసి యీడేరవలెఁగాక
Language

(॥పల్లవి॥)
ఇచ్చకములే సేసి యీడేరవలెఁగాక
పచ్చిగా బలిమిసేసి పదరఁగవచ్చునా

(॥ఇచ్చ॥)
వోసరించి వేడుకల కొడిగట్టినవారికి
వేసరఁగవచ్చునా వేగినంతాను
ఆసలనే తుదకెక్కి ఆఱడైనవారికి
గోసనాసగాఁ బతిని గుంపించవచ్చునా

(॥ఇచ్చ॥)
చూపులకే లాచి లాచి చొక్కియుండేవారికి
వోపననవచ్చునా వూరకైనాను
యేపున మోవితేనెకు నేఁకరేటివారికి
మాపుదాఁకా జోలిసేసి మఱవఁగ వచ్చునా

(॥ఇచ్చ॥)
తనివోని కాఁగిట దగులైనవారికి
చెనక కుండవచ్చునా చేతులారాను
యెనసె శ్రీవేంకటేశుఁ డింతలోనె నిన్ను నేఁడు
పెనఁగులాటకాక పిరితియ్యవచ్చునా

(||pallavi||)
ichchagamule sesi yīḍeravalĕm̐gāga
pachchigā balimisesi padaram̐gavachchunā

(||ichcha||)
vosariṁchi veḍugala kŏḍigaṭṭinavārigi
vesaram̐gavachchunā veginaṁtānu
āsalane tudagĕkki āṟaḍainavārigi
gosanāsagām̐ badini guṁpiṁchavachchunā

(||ichcha||)
sūbulage lāsi lāsi sŏkkiyuṁḍevārigi
vobananavachchunā vūragainānu
yebuna movidenĕgu nem̐kareḍivārigi
mābudām̐kā jolisesi maṟavam̐ga vachchunā

(||ichcha||)
tanivoni kām̐giḍa dagulainavārigi
sĕnaga kuṁḍavachchunā sedulārānu
yĕnasĕ śhrīveṁkaḍeśhum̐ ḍiṁtalonĕ ninnu nem̐ḍu
pĕnam̐gulāḍagāga piridiyyavachchunā