Ichchagamu sesugoni iyyagonudagaaga

ఇచ్చకము సేసుకొని ఇయ్యకొనుటగాక
Language

(॥పల్లవి॥)
ఇచ్చకము సేసుకొని ఇయ్యకొనుటగాక
రచ్చలోన సారె సారె రవ్వసేయనేల

(॥ఇచ్చ॥)
దొరయైనసతి సవతుల నెందరిఁ దెచ్చినా
యెరపులేని ఇల్లాలి కేల కోపము
సిరుల కొనగోరిలచ్చెన లెన్ని నించుకొన్నా
విరసము చేసుకొని వెంగెమాడనేల

(॥ఇచ్చ॥)
చలపాదిమగఁడు విచ్చనవిడిఁ దిరిగితే
వలచినదేవులకు వాదించనేల
వొలసి యెందరిచే సేవలు సేయించుకొన్న
బలిమితోడుత కడుఁ బంగించనేలా

(॥ఇచ్చ॥)
జిగి శ్రీవేంకటేశుఁడు చేరి యెంత పెండ్లాడినా
మిగులాఁ బంతకత్తెకు మీఱఁగనేలా
నగుతా నిన్నుఁ గూడె నాయకుఁ డీతఁడే నేఁడు
వెగటైన సిగ్గులకు వెరగందనేలా

(||pallavi||)
ichchagamu sesugŏni iyyagŏnuḍagāga
rachchalona sārĕ sārĕ ravvaseyanela

(||ichcha||)
dŏrayainasadi savadula nĕṁdarim̐ dĕchchinā
yĕrabuleni illāli kela kobamu
sirula kŏnagorilachchĕna lĕnni niṁchugŏnnā
virasamu sesugŏni vĕṁgĕmāḍanela

(||ichcha||)
salabādimagam̐ḍu vichchanaviḍim̐ dirigide
valasinadevulagu vādiṁchanela
vŏlasi yĕṁdarise sevalu seyiṁchugŏnna
balimidoḍuda kaḍum̐ baṁgiṁchanelā

(||ichcha||)
jigi śhrīveṁkaḍeśhum̐ḍu seri yĕṁta pĕṁḍlāḍinā
migulām̐ baṁtagattĕgu mīṟam̐ganelā
nagudā ninnum̐ gūḍĕ nāyagum̐ ḍīdam̐ḍe nem̐ḍu
vĕgaḍaina siggulagu vĕragaṁdanelā