Ichchagame sesidenu yeederu valabulu

ఇచ్చకమే సేసితేను యీడేరు వలపులు
Language

(॥పల్లవి॥)
ఇచ్చకమే సేసితేను యీడేరు వలపులు
మచ్చికలే చూపవలె మగవానితోను

(॥ఇచ్చ॥)
శిరసు వంచకువే సిగ్గులు వడకువే
తెరదీసి నిన్నతఁడు తేరి చూచీని
మరఁగు వెట్టుకొకువే మరి తప్పించుకోకువే
విరుల చెండున నిన్ను వేసితే నేమాయను

(॥ఇచ్చ॥)
మొక్కులు మొక్కకువే ముంచి చేయి పట్టకువే
పక్కన నీ చన్నులు పట్టీ నితఁడు
మిక్కిలి జంకించకువే మీరి యాన వెట్టకువే
పిక్కటిల్లఁ గాఁగిటను బిగియించఁగాను

(॥ఇచ్చ॥)
పెనఁగు లాడకువే బెట్టి గోర నూఁదకువే
ననుపున నీతోను నవ్వేవేళను
యెనసె శ్రీవేంకటేశుఁ డిఁక నేమీననకువే
చనవిచ్చి తనమోవి చవి చూపీ నితఁడు

(||pallavi||)
ichchagame sesidenu yīḍeru valabulu
machchigale sūbavalĕ magavānidonu

(||ichcha||)
śhirasu vaṁchaguve siggulu vaḍaguve
tĕradīsi ninnadam̐ḍu teri sūsīni
maram̐gu vĕṭṭugŏguve mari tappiṁchugoguve
virula sĕṁḍuna ninnu veside nemāyanu

(||ichcha||)
mŏkkulu mŏkkaguve muṁchi seyi paṭṭaguve
pakkana nī sannulu paṭṭī nidam̐ḍu
mikkili jaṁkiṁchaguve mīri yāna vĕṭṭaguve
pikkaḍillam̐ gām̐giḍanu bigiyiṁcham̐gānu

(||ichcha||)
pĕnam̐gu lāḍaguve bĕṭṭi gora nūm̐daguve
nanubuna nīdonu navveveḽanu
yĕnasĕ śhrīveṁkaḍeśhum̐ ḍim̐ka nemīnanaguve
sanavichchi tanamovi savi sūbī nidam̐ḍu