I am in love

I am in love
Work
Year
Language

పల్లవి:

I am in love I am in love I am in love with you
కనులలో దాచినా కావ్యమే నువ్వూ
కావేరి కదిలితె మేఘాలు ఉరిమితె మనసులో నువ్వే
ఆ నింగి కరిగితె ఈ నేల చేరిన చినుకువే నువ్వే
గుండెలో చిరు కలవరం తొలిసారిగా నువ్వే
అర్పితం ఈ జీవితం నిను చేరడం కొరకే

I am in love I am in love I am in love with you
కనులలో దాచినా కావ్యమే నువ్వూ

చరణం 1:

కోటి కలలను గుండెలోతులో దాచి ఉంచిన నేస్తమా
వేయి అలలుగ నిన్ను చేరగ కదులుతున్నా ప్రాణమా
వెన్నెల్లో గోదారీ నువ్వే నా వయ్యారి నేనీటి చుక్కై పోవాలీ
నవ్వేటి సింగారీ వెళ్ళొద్దే చేజారీ నిను చేరి మురిసిపోవాలి

చిగురాకు నువ్వై చిరుజల్లు నేనై
నిను నేను చెరుకుంటె హాయి
నిను నేను చెరుకుంటె హాయి

చరణం 2:

నీవు ఎదురుగ నిలచి ఉండగ మాట దాటదు పెదవినీ
నన్ను వధువుగ నువ్వు తాకగ మధువు సోకెను మనసుని
నీ చెంత చేరాలీ స్వర్గాన్నే చూడాలీ నేనీలో నిండిపోవాలీ
నీకంటి చూపుల్లో నీ ప్రేమ వానల్లో నిలువెల్ల నేనే తడవాలీ
నాలోనీ ప్రేమా ఏనాటికైనా నీకే అంకితమవ్వనీ
నీకే అంకితమవ్వనీ

I am in love I am in love I am in love with you
కనులలో దాచినా కావ్యమే నువ్వూ
కావేరి కదిలితె మేఘాలె ఉరిమితె మనసులో నువ్వే
ఆ నింగి కరిగితె ఈ నేల చేరిన చినుకువే నువ్వే
గుండెలో చిరు కలవరం తొలిసారిగా నువ్వే
అర్పితం ఈ జీవితం నిను చేరడం కొరకే

pallavi:

I am in love I am in love I am in love with you
kanulalo dāsinā kāvyame nuvvū
kāveri kadilidĕ meghālu urimidĕ manasulo nuvve
ā niṁgi karigidĕ ī nela serina sinuguve nuvve
guṁḍĕlo siru kalavaraṁ tŏlisārigā nuvve
arbidaṁ ī jīvidaṁ ninu seraḍaṁ kŏrage

I am in love I am in love I am in love with you
kanulalo dāsinā kāvyame nuvvū

saraṇaṁ 1:

koḍi kalalanu guṁḍĕlodulo dāsi uṁchina nestamā
veyi alaluga ninnu seraga kaduludunnā prāṇamā
vĕnnĕllo godārī nuvve nā vayyāri nenīḍi sukkai povālī
navveḍi siṁgārī vĕḽḽŏdde sejārī ninu seri murisibovāli

sigurāgu nuvvai sirujallu nenai
ninu nenu sĕruguṁṭĕ hāyi
ninu nenu sĕruguṁṭĕ hāyi

saraṇaṁ 2:

nīvu ĕduruga nilasi uṁḍaga māḍa dāḍadu pĕdavinī
nannu vadhuvuga nuvvu tāgaga madhuvu sogĕnu manasuni
nī sĕṁta serālī svargānne sūḍālī nenīlo niṁḍibovālī
nīgaṁṭi sūbullo nī prema vānallo niluvĕlla nene taḍavālī
nālonī premā enāḍigainā nīge aṁkidamavvanī
nīge aṁkidamavvanī

I am in love I am in love I am in love with you
kanulalo dāsinā kāvyame nuvvū
kāveri kadilidĕ meghālĕ urimidĕ manasulo nuvve
ā niṁgi karigidĕ ī nela serina sinuguve nuvve
guṁḍĕlo siru kalavaraṁ tŏlisārigā nuvve
arbidaṁ ī jīvidaṁ ninu seraḍaṁ kŏrage