Hyaabi hyaabi bart delu

హ్యాపి హ్యాపి బర్త్ డేలు
Year
Language

పల్లవి:

హ్యాపి హ్యాపి బర్త్ డేలు మళ్లి మళ్లి చేసుకోగ శుభాకాంక్షలందజేయమా .. మిత్రమా
ఆపలేని స్వేచ్ఛ ఉంది .. అందినంత ఛాన్సు ఉంది అందుకోర పుత్ర రత్నమా .. నేస్తమా

జీవితానికే అర్థం ప్రేమని మరిచిపోదు మా యవ్వనమే
ప్రేమ అన్నదే సర్వం కాదని చాటుతుంది మా అనుభవమే
చిలిపి వయసు వరస తమకు తెలియదా
హ్యాపి హ్యాపీ... ఓ... ఓ...

చరణం 1:

తెలియకడుగుతున్నాలే కంప్యూటరేమంటోంది
పాఠమెంత అవుతున్నా ఫలితం ఏమైంది

బోధపడని కంప్యూటర్ బదులన్నదే లేదంది
విసుగురాని నా మనసే ఎదురే చూస్తోంది

ప్రేమకథలు ఎప్పుడైన ఒకటే ట్రెండ్
ఆచితూచి ముందుకెళ్ళు ఓ మై ఫ్రెండ్

అప్టుడేటు ట్రెండు మాది టోటల్ చేంజ్
పాత నీతులింక మాకు నో ఎక్స్ఛేంజ్
ఫ్రెండులాంటి పెద్దవాడి అనుభవాలసారమే శాసనాలు కావు
నీకు సలహాలు మాత్రమే...
కలను వదలి ఇలను తెలిసి నడుచుకో !

చరణం 2:

నింగిలోని చుక్కలనే చిటికేసి రమ్మనలేమా
తలచుకుంటే ఏమైనా ఎదురేలేదనమా

నేల విడిచి సామైతే టైం వేస్టురా ఈ ధీమా
ముందు వెనుక గమనిస్తే విజయం నీది సుమా

రోజా నవ్వు రమ్మంటున్న రోజు కదా
తాకకుండ ఊరుకుంటె తప్పు కదా

నవ్వు కింద పొంచి ఉన్న ముళ్ళు కదా
చూడకుండ చెయ్యి వేస్తే ముప్పు కదా
ముళ్ళు చూసి ఆగిపోతే పువ్వులింక దక్కునా
లక్ష్యమందకుండ లైఫుకర్థమింక ఉండునా
తెగువ తెలుపు గెలుపు మనకి దొరకగ !

pallavi:

hyābi hyābi bart ḍelu maḽli maḽli sesugoga śhubhāgāṁkṣhalaṁdajeyamā .. mitramā
ābaleni svechchha uṁdi .. aṁdinaṁta shānsu uṁdi aṁdugora putra ratnamā .. nestamā

jīvidānige ardhaṁ premani marisibodu mā yavvaname
prema annade sarvaṁ kādani sāḍuduṁdi mā anubhavame
silibi vayasu varasa tamagu tĕliyadā
hyābi hyābī... o... o...

saraṇaṁ 1:

tĕliyagaḍugudunnāle kaṁpyūḍaremaṁṭoṁdi
pāṭhamĕṁta avudunnā phalidaṁ emaiṁdi

bodhabaḍani kaṁpyūḍar badulannade ledaṁdi
visugurāni nā manase ĕdure sūstoṁdi

premagathalu ĕppuḍaina ŏgaḍe ṭrĕṁḍ
āsidūsi muṁdugĕḽḽu o mai phrĕṁḍ

apṭuḍeḍu ṭrĕṁḍu mādi ṭoḍal seṁj
pāda nīduliṁka māgu no ĕkschheṁj
phrĕṁḍulāṁṭi pĕddavāḍi anubhavālasārame śhāsanālu kāvu
nīgu salahālu mātrame...
kalanu vadali ilanu tĕlisi naḍusugo !

saraṇaṁ 2:

niṁgiloni sukkalane siḍigesi rammanalemā
talasuguṁṭe emainā ĕdureledanamā

nela viḍisi sāmaide ṭaiṁ vesṭurā ī dhīmā
muṁdu vĕnuga gamaniste vijayaṁ nīdi sumā

rojā navvu rammaṁṭunna roju kadā
tāgaguṁḍa ūruguṁṭĕ tappu kadā

navvu kiṁda pŏṁchi unna muḽḽu kadā
sūḍaguṁḍa sĕyyi veste muppu kadā
muḽḽu sūsi āgibode puvvuliṁka dakkunā
lakṣhyamaṁdaguṁḍa laiphugardhamiṁka uṁḍunā
tĕguva tĕlubu gĕlubu managi dŏragaga !