Hrdayamane kovela talubulu

హృదయమనే కోవెల తలుపులు
Year
Language

పల్లవి:

ఆ ఆ ఆ హృదయమనే కోవెల తలుపులు తెరిచే తాళం..
ప్రేమా.. ప్రేమా.. ప్రేమా.. ప్రేమా
ఆ ఆ ఆ ఆ త్యాగమనే దేవత సన్నిధి వెలిగే దీపం
ప్రేమా.. ప్రేమా.. ప్రేమా.. ప్రేమా
అణువణువును చెలిమికి అంకితమిచ్చును ప్రేమ
తను నిలువున కరుగుతు కాంతి పంచునది ప్రేమ
గగనానికి నేలకి వంతెన వేసిన వాన విల్లు ఈ ప్రేమ
ప్రేమా.. ప్రేమా.. ప్రేమా.. ప్రేమా
ఆ ఆ ఆ ఆ హృదయమనే కోవెల తలుపులు తెరిచే తాళం
ప్రేమా.. ప్రేమా.. ప్రేమా.. ప్రేమా

చరణం 1:

ఇవ్వడమే..నేర్పగల ఈ ప్రేమా..తన కొరకు ఏ సిరిని అడగదు కదా...
నవ్వడమే..చూపగల ఈ ప్రేమా..మంటలనే వెన్నెలగా మార్చును కదా...

గాలికి గంధము పూయడమే..పూలకు తెలిసిన ప్రేమ సుధ
రాలిన పువ్వుల జ్ఞాపకమే..కాలం చదివే ప్రేమ కథ
ప్రియమైన తనవారి..సుఖశాంతులే కోరి..మురిసేటి గుణమే ప్రేమా...
ప్రేమా.. ప్రేమా.. ప్రేమా.. ప్రేమా

ఆ ఆ ఆ ఆ హృదయమనే కోవెల తలుపులు తెరిచే తాళం
ప్రేమా.. ప్రేమా.. ప్రేమా.. ప్రేమా

చరణం 2:

ఏ జతనో..ఎందుకో విడదీసీ..వెంటాడి వేటాడు ఆటే ప్రేమా
మౌనముతో..మనసునే శృతి చేసీ..రాగాలు పలికించు పాటే ప్రేమా

శాశ్వత చరితల ఈ ప్రేమ..మృత్యువు ఎరగని చిరునామా
శ్వాసను మంగళ హారతిగా..వెలిగించేదే ఈ ప్రేమ
మరణాన్ని ఎదిరించి…
మరణాన్ని ఎదిరించి… మరుజన్మగా వచ్చి…
మరణాన్ని ఎదిరించి… మరుజన్మగా వచ్చి… కరుణించు వరమే ప్రేమా...
ప్రేమా.. ప్రేమా.. ప్రేమా.. ప్రేమా

ఆ ఆ ఆ ఆ హృదయమనే కోవెల తలుపులు తెరిచే తాళం
ప్రేమా.. ప్రేమా.. ప్రేమా.. ప్రేమా
ఆ ఆ ఆ ఆ త్యాగమనే దేవత సన్నిధి వెలిగే దీపం
ప్రేమా.. ప్రేమా.. ప్రేమా.. ప్రేమా

pallavi:

ā ā ā hṛdayamane kovĕla talubulu tĕrise tāḽaṁ..
premā.. premā.. premā.. premā
ā ā ā ā tyāgamane devada sannidhi vĕlige dībaṁ
premā.. premā.. premā.. premā
aṇuvaṇuvunu sĕlimigi aṁkidamichchunu prema
tanu niluvuna karugudu kāṁti paṁchunadi prema
gaganānigi nelagi vaṁtĕna vesina vāna villu ī prema
premā.. premā.. premā.. premā
ā ā ā ā hṛdayamane kovĕla talubulu tĕrise tāḽaṁ
premā.. premā.. premā.. premā

saraṇaṁ 1:

ivvaḍame..nerbagala ī premā..tana kŏragu e sirini aḍagadu kadā...
navvaḍame..sūbagala ī premā..maṁṭalane vĕnnĕlagā mārsunu kadā...

gāligi gaṁdhamu pūyaḍame..pūlagu tĕlisina prema sudha
rālina puvvula jñābagame..kālaṁ sadive prema katha
priyamaina tanavāri..sukhaśhāṁtule kori..muriseḍi guṇame premā...
premā.. premā.. premā.. premā

ā ā ā ā hṛdayamane kovĕla talubulu tĕrise tāḽaṁ
premā.. premā.. premā.. premā

saraṇaṁ 2:

e jadano..ĕṁdugo viḍadīsī..vĕṁṭāḍi veḍāḍu āḍe premā
maunamudo..manasune śhṛti sesī..rāgālu paligiṁchu pāḍe premā

śhāśhvada saridala ī prema..mṛtyuvu ĕragani sirunāmā
śhvāsanu maṁgaḽa hāradigā..vĕligiṁchede ī prema
maraṇānni ĕdiriṁchi…
maraṇānni ĕdiriṁchi… marujanmagā vachchi…
maraṇānni ĕdiriṁchi… marujanmagā vachchi… karuṇiṁchu varame premā...
premā.. premā.. premā.. premā

ā ā ā ā hṛdayamane kovĕla talubulu tĕrise tāḽaṁ
premā.. premā.. premā.. premā
ā ā ā ā tyāgamane devada sannidhi vĕlige dībaṁ
premā.. premā.. premā.. premā