పల్లవి:
హాయ్ రే హాయ్ జాంపండు రోయ్
హాయ్ రే హాయ్ జాంపండు రోయ్
కళ్ళ ముందు కదులుతోంది రోయ్ ముద్దుగా
ఏ రూపురా ..ఏ రంగురా... ఏ రూపురా ఏ రంగురా
సొంతమైతే అంత కన్నా నా అయ్య బాబోయ్
హాయ్ రే హాయ్ జాంపండు రోయ్
హాయ్ రే హాయ్ జాంపండు రోయ్
చూడగానే నోరూరెరా తియ్యగా...
ఏ రూపురా.. ఏ రంగురా.. ఏ రూపురా.. ఏ రంగురా..
సొంతమైతే అంత కన్నా నా అయ్య బాబోయ్
చరణం 1:
అందమైన కోనసీమ కొబ్బరాకులా
తెల్లవారి వెలుగులోన తులసి మొక్కలా
పెరటిలోన పెంచుకున్న ముద్దబంతిలా
పెరుగులోన నంజుకున్న ఆవకాయలా
బుట్ట బొమ్మలా పాల పిట్టలా గట్టు దాటు గోదారిలా
యా..యా..యా..యా..
యా..య..యా...యా..
హోయ్ తేనె చుక్కలా వాన చినుకులా
మామ్మ గారి ముక్కు పుడకలా ఉంది పిల్ల
హాయ్ రే హాయ్ జాంపండు రోయ్
హాయ్ రే హాయ్ జాంపండు రోయ్
చరణం 2:
పాత తెలుగు సినిమాలో సావిత్రిలా
ఆలయాన వెలుగుతున్న చిన్ని దివ్వెలా
తామరాకు ఒంటి పైన నీటి బొట్టులా
వాకిలంతా నిండి వున్న రంగు ముగ్గులా
చేప పిల్లలా చందమామలా ముద్దు ముద్దు మల్లె మొగ్గలా
యా..యా..యా...యా
యా..యా...యా...యా...
హోయ్ చెరుకు పంటలా భోగి మంటలా
పసుపు రంగు ఇంటి గడపలా ఉంది పిల్ల
హాయ్ రే హాయ్ జాంపండు రోయ్
హాయ్ రే హాయ్ జాంపండు రోయ్
కళ్ళ ముందు కదులుతోంది రోయ్ ముద్దుగా
ఏ రూపురా ఏ రంగురా ఏ రూపురా ఏ రంగురా
సొంతమైతే అంత కన్నా నా అయ్య బాబోయ్
హాయ్ రే హాయ్ జాంపండు రోయ్
హాయ్ రే హాయ్ జాంపండు రోయ్