గుట్టుసేసుకో నీలోలో గుబ్బతిలీ వలపులు
(॥పల్లవి॥)
గుట్టుసేసుకో నీలోలో గుబ్బతిలీ వలపులు
చుట్టరిక మేవేళ చూపీనో నీకును
(॥గుట్టు॥)
చిప్పిలుసిగ్గులతోడఁ జెలి నీయొద్ద నిలిచె
కప్పుకొనెఁ బయ్యద జంగాళముగాను
విప్పినదోసిట నీకు విడెమియ్యవచ్చె నదె
యెప్పుడు మోమెత్తి చూచి యెనసీనో నిన్నును
(॥గుట్టు॥)
తనివోనితమితోడ తనసింగారాలు చూపి(పె?)
పెనుఁగొప్పు మఱఁగుగాఁ బెట్టెఁ జెంపల
పనివూని వేడుకతోఁ బాదాలొత్త లాచీనదె
మనసిచ్చి యేపొద్దు మాటాడీనో నీతోను
(॥గుట్టు॥)
కడకంటిచూపులతో కమ్మటి నిన్నుఁ గొసరె
చిడుముడి చిఱునవ్వు చిందుకొంటాను
అడరి శ్రీవేంకటేశ యలమేల్మంగపతివి
యెడయక నన్నేలితి వెన్నఁడు తాఁ బొందీనో
(||pallavi||)
guṭṭusesugo nīlolo gubbadilī valabulu
suṭṭariga meveḽa sūbīno nīgunu
(||guṭṭu||)
sippilusigguladoḍam̐ jĕli nīyŏdda nilisĕ
kappugŏnĕm̐ bayyada jaṁgāḽamugānu
vippinadosiḍa nīgu viḍĕmiyyavachchĕ nadĕ
yĕppuḍu momĕtti sūsi yĕnasīno ninnunu
(||guṭṭu||)
tanivonidamidoḍa tanasiṁgārālu sūbi(pĕ?)
pĕnum̐gŏppu maṟam̐gugām̐ bĕṭṭĕm̐ jĕṁpala
panivūni veḍugadom̐ bādālŏtta lāsīnadĕ
manasichchi yebŏddu māḍāḍīno nīdonu
(||guṭṭu||)
kaḍagaṁṭisūbulado kammaḍi ninnum̐ gŏsarĕ
siḍumuḍi siṟunavvu siṁdugŏṁṭānu
aḍari śhrīveṁkaḍeśha yalamelmaṁgabadivi
yĕḍayaga nannelidi vĕnnam̐ḍu tām̐ bŏṁdīno