గుట్టుతోనే నుండిన నాగుణ మెంచఁడు
(॥పల్లవి॥)
గుట్టుతోనే నుండిన నాగుణ మెంచఁడు
ఇట్టె తా నెట్టుండినా నేమిసేయవచ్చునే
(॥గుట్టు॥)
కొలువులో నే నుండఁగా కొంగువట్టి తీసీని
చులకఁదనము గాదా చూచేవారికి
బలుదొర తాను సిగ్గువడ నేరకుండితేను
యెలమిఁ దన్నిందరిలో నేమిసేయవచ్చునే
(॥గుట్టు॥)
బంతినుండి పెండ్లిపాట వాడఁగా నన్నుఁ జెనకీ
ఇంతయు వెగటుగాదా ఇంటి వారికి
పంతగాఁడు తన కెరపరికము లేకుండితే
ఇంతినైననాకుఁ దను నేమిసేయవచ్చునే
(॥గుట్టు॥)
విందుచెప్పి వడ్డించఁగా వెస నామోవి సోఁకించీ
అందె నగుఁబాటుగాదా అండవారికి
కందువఁ గూడె శ్రీవేంకటేశు తానె నన్ను
ఇందె తెరవేసె నిఁక నేమిసేయవచ్చునే
(||pallavi||)
guṭṭudone nuṁḍina nāguṇa mĕṁcham̐ḍu
iṭṭĕ tā nĕṭṭuṁḍinā nemiseyavachchune
(||guṭṭu||)
kŏluvulo ne nuṁḍam̐gā kŏṁguvaṭṭi tīsīni
sulagam̐danamu gādā sūsevārigi
baludŏra tānu sigguvaḍa neraguṁḍidenu
yĕlamim̐ danniṁdarilo nemiseyavachchune
(||guṭṭu||)
baṁtinuṁḍi pĕṁḍlibāḍa vāḍam̐gā nannum̐ jĕnagī
iṁtayu vĕgaḍugādā iṁṭi vārigi
paṁtagām̐ḍu tana kĕrabarigamu leguṁḍide
iṁtinainanāgum̐ danu nemiseyavachchune
(||guṭṭu||)
viṁdusĕppi vaḍḍiṁcham̐gā vĕsa nāmovi som̐kiṁchī
aṁdĕ nagum̐bāḍugādā aṁḍavārigi
kaṁduvam̐ gūḍĕ śhrīveṁkaḍeśhu tānĕ nannu
iṁdĕ tĕravesĕ nim̐ka nemiseyavachchune