గుట్టుతోడివారినేల రట్టు సేసేవు
(॥పల్లవి॥)
గుట్టుతోడివారినేల రట్టు సేసేవు
జట్టిగొని కొసరఁగ సన్నెఱఁగవు
(॥గుట్టు॥)
కొమ్మ నిన్ను జూచి చూచి కొప్పు దువ్వుకొనుటెల్లా
రమ్మనుటగాదా యేల రంతు సేసేవు
కమ్మర నప్పటి నీకతల కూరకుండుట
సమ్మతించుటగాదా సన్నెఱఁగవు
(॥గుట్టు॥)
చెలియ నీమొగమై సిగ్గుపడుటెల్లాను
కలసేకొరకేకాదా కాఁతాళించేవు
పొలయుట నీముందర పొందుసేసేనని నీతో
చలపట్టుటగాదా నన్నెఱఁగవు
(॥గుట్టు॥)
సతి నీసంగడినుండి సరసమాడుటెల్లాను
రతికిఁదీసుట గాదా రావా(పా?) డేవు
యితవై శ్రీవేంకటేశ యీకె యిట్టె నిన్నుఁ గూడె
చతురత లివిగావా నన్నెఱఁగవు
(||pallavi||)
guṭṭudoḍivārinela raṭṭu sesevu
jaṭṭigŏni kŏsaram̐ga sannĕṟam̐gavu
(||guṭṭu||)
kŏmma ninnu jūsi sūsi kŏppu duvvugŏnuḍĕllā
rammanuḍagādā yela raṁtu sesevu
kammara nappaḍi nīgadala kūraguṁḍuḍa
sammadiṁchuḍagādā sannĕṟam̐gavu
(||guṭṭu||)
sĕliya nīmŏgamai siggubaḍuḍĕllānu
kalasegŏragegādā kām̐tāḽiṁchevu
pŏlayuḍa nīmuṁdara pŏṁdusesenani nīdo
salabaṭṭuḍagādā nannĕṟam̐gavu
(||guṭṭu||)
sadi nīsaṁgaḍinuṁḍi sarasamāḍuḍĕllānu
radigim̐dīsuḍa gādā rāvā(pā?) ḍevu
yidavai śhrīveṁkaḍeśha yīgĕ yiṭṭĕ ninnum̐ gūḍĕ
sadurada livigāvā nannĕṟam̐gavu