Guttudodi neevu nannu gorabuseyaguvayya

గుట్టుతోడి నీవు నన్ను గొరబుసేయకువయ్య
Language

(॥పల్లవి॥)
గుట్టుతోడి నీవు నన్ను గొరబుసేయకువయ్య
వుట్టిపడి నాతో నవ్వనోపుదువా

(॥గుట్టు॥)
ఆయములు సోఁక నీతో నాడుకొనఁజాలఁగాక
పాయపునీయాలఁగానా పరాకేఁటికి
చేయిచాఁచ కిటు నీతో సిగ్గువడి వుందానగా-
కోయినీవు నాతో సంతకోపుదువా

(॥గుట్టు॥)
కన్నుల జంకించి నిన్ను కక్కసించఁజాలఁగాక
మన్నించేదానఁగాన మాయలేఁటికి
చన్నుల నే నొత్తి నీతో సరసములాడఁగాక
వున్నపనుల కంతేసి కోపుదువా

(॥గుట్టు॥)
తేనెగారేమోవి ఇచ్చి తిట్టు దిట్టఁజాలఁగాక
మేనదానఁగాన నాతో మేకులేఁటికి
యీనెపాన శ్రీవేంకటేశ నన్నుఁ గూడితివి
పూనిననారతులకు వోపుదువా

(||pallavi||)
guṭṭudoḍi nīvu nannu gŏrabuseyaguvayya
vuṭṭibaḍi nādo navvanobuduvā

(||guṭṭu||)
āyamulu som̐ka nīdo nāḍugŏnam̐jālam̐gāga
pāyabunīyālam̐gānā parāgem̐ṭigi
seyisām̐sa kiḍu nīdo sigguvaḍi vuṁdānagā-
koyinīvu nādo saṁtagobuduvā

(||guṭṭu||)
kannula jaṁkiṁchi ninnu kakkasiṁcham̐jālam̐gāga
manniṁchedānam̐gāna māyalem̐ṭigi
sannula ne nŏtti nīdo sarasamulāḍam̐gāga
vunnabanula kaṁtesi kobuduvā

(||guṭṭu||)
tenĕgāremovi ichchi tiṭṭu diṭṭam̐jālam̐gāga
menadānam̐gāna nādo megulem̐ṭigi
yīnĕbāna śhrīveṁkaḍeśha nannum̐ gūḍidivi
pūninanāradulagu vobuduvā