Guttudodi bradu koga kolamdainam jaaluraa

గుట్టుతోడి బ్రదు కొక కొలఁదైనఁ జాలురా
Language

(॥పల్లవి॥)
గుట్టుతోడి బ్రదు కొక కొలఁదైనఁ జాలురా
గట్టిగా నీవు మన్నించే కరుణే చాలురా

(॥గుట్టు॥)
మొదల నలుగలేను ముంచి నీకు మొక్కలేను
కదిసియున్న పెద్దరికమే చాలురా
పెదవులఁ దిట్టలేను పెంచి పంతమియ్యలేను
అదన నీవు నవ్విన ఆపాటే చాలురా

(॥గుట్టు॥)
బిగిసియుండగలేను ప్రియము చెప్పఁగలేను
మొగము చూడఁగలిగేముచ్చటే చాలురా
తగవులు చెప్పలేను తగ నిచ్చలాడలేను
తగువైన వావులతో తత్తరాలే చాలురా

(॥గుట్టు॥)
అటు పరాకు గాలేను ఆనవెట్టుకోలేను
యిటుఁ నిన్నుఁ గూడితి నాకిది చాలురా
ఘటన శ్రీవేంకటేశ కరఁగించి మానలేను
తటుకున నీవు నాకు దక్కినదే చాలురా

(||pallavi||)
guṭṭudoḍi bradu kŏga kŏlam̐dainam̐ jālurā
gaṭṭigā nīvu manniṁche karuṇe sālurā

(||guṭṭu||)
mŏdala nalugalenu muṁchi nīgu mŏkkalenu
kadisiyunna pĕddarigame sālurā
pĕdavulam̐ diṭṭalenu pĕṁchi paṁtamiyyalenu
adana nīvu navvina ābāḍe sālurā

(||guṭṭu||)
bigisiyuṁḍagalenu priyamu sĕppam̐galenu
mŏgamu sūḍam̐galigemuchchaḍe sālurā
tagavulu sĕppalenu taga nichchalāḍalenu
taguvaina vāvulado tattarāle sālurā

(||guṭṭu||)
aḍu parāgu gālenu ānavĕṭṭugolenu
yiḍum̐ ninnum̐ gūḍidi nāgidi sālurā
ghaḍana śhrīveṁkaḍeśha karam̐giṁchi mānalenu
taḍuguna nīvu nāgu dakkinade sālurā