గుట్టుతోడ నుండరాదా కొమ్మ తానే ప్రియముసేసీ
(॥పల్లవి॥)
గుట్టుతోడ నుండరాదా కొమ్మ తానే ప్రియముసేసీ
అట్టె ఆపెకెంత ప్రియములు చెప్పేవయ్యా
(॥గుట్టు॥)
సిగ్గరిదాన నంతేసి చెనకఁగనేఁటికి
యెగ్గవట్టేదానితో నేలాటాలెల
వెగ్గళించి మాటాడఁగా వేడుకౌనా సరససాలు
బగ్గన వలపు లెంత పారఁజల్లెవయ్యా
(॥గుట్టు॥)
వాసివంతులెంచేదానివంక చూచి నవ్వనేల
వేసరేటిదాని నేమివేఁడుకొనేవు
రేసిరేసి పెనఁగఁగా రేఁగునా తమకములు
మూసిన సిగ్గునేల ముంగిటవేసేవయ్యా
(॥గుట్టు॥)
చన్నునలనొ త్తేదానితో సాములు సేయఁగనేల
సన్నవేల శ్రీవేంకటేశ్వర దానితో
పన్ని యలమేలుమంగపతివి నన్నేలితివి
వున్నతపు రతులెన్ని వొడిఁగట్టేవయ్యా
(||pallavi||)
guṭṭudoḍa nuṁḍarādā kŏmma tāne priyamusesī
aṭṭĕ ābĕgĕṁta priyamulu sĕppevayyā
(||guṭṭu||)
siggaridāna naṁtesi sĕnagam̐ganem̐ṭigi
yĕggavaṭṭedānido nelāḍālĕla
vĕggaḽiṁchi māḍāḍam̐gā veḍugaunā sarasasālu
baggana valabu lĕṁta pāram̐jallĕvayyā
(||guṭṭu||)
vāsivaṁtulĕṁchedānivaṁka sūsi navvanela
vesareḍidāni nemivem̐ḍugŏnevu
resiresi pĕnam̐gam̐gā rem̐gunā tamagamulu
mūsina siggunela muṁgiḍavesevayyā
(||guṭṭu||)
sannunalanŏ ttedānido sāmulu seyam̐ganela
sannavela śhrīveṁkaḍeśhvara dānido
panni yalamelumaṁgabadivi nannelidivi
vunnadabu radulĕnni vŏḍim̐gaṭṭevayyā