గుట్టుతో మంచితనాలే కోరి చూపవలెఁగాక
(॥పల్లవి॥)
గుట్టుతో మంచితనాలే కోరి చూపవలెఁగాక
యెట్టయెదుటనే వుండి ఇంత యెలఇంతురా
(॥గుట్టు॥)
వొడిఁగట్టినవలపు లుమ్మగిలుచుండఁగాను
సడిఁబెట్టి పతినేమి సాదించేవే
తడిసి పెంజెమటలు తనువులఁ గారఁగాను
పెడరేఁచి యాతనితోఁ బెనఁగులాడుదురా
(॥గుట్టు॥)
కొప్పనఁ బెట్టిన సేస కొనికల జారఁగాను
కప్పి పయ్యెదతో నేమి గయ్యాళించేవే
చిప్పిల నవ్విన నవ్వు సెలవుల నించఁగాను
వుప్పతించి యాతనితో నొడ్డారా లాడుదురా
(॥గుట్టు॥)
మనసులో కోరికలు మల్లడిగొనుచుండఁగా
వెనక ముందరలేమి వెసఁజూచేవే
యెనసె శ్రీవేంకటేశుఁ డింతలోనె నిన్ను నేఁడు
చెనకులు మైనుండఁగా సిగ్గున లోఁగుదురా
(||pallavi||)
guṭṭudo maṁchidanāle kori sūbavalĕm̐gāga
yĕṭṭayĕduḍane vuṁḍi iṁta yĕla̮iṁturā
(||guṭṭu||)
vŏḍim̐gaṭṭinavalabu lummagilusuṁḍam̐gānu
saḍim̐bĕṭṭi padinemi sādiṁcheve
taḍisi pĕṁjĕmaḍalu tanuvulam̐ gāram̐gānu
pĕḍarem̐si yādanidom̐ bĕnam̐gulāḍudurā
(||guṭṭu||)
kŏppanam̐ bĕṭṭina sesa kŏnigala jāram̐gānu
kappi payyĕdado nemi gayyāḽiṁcheve
sippila navvina navvu sĕlavula niṁcham̐gānu
vuppadiṁchi yādanido nŏḍḍārā lāḍudurā
(||guṭṭu||)
manasulo korigalu mallaḍigŏnusuṁḍam̐gā
vĕnaga muṁdaralemi vĕsam̐jūseve
yĕnasĕ śhrīveṁkaḍeśhum̐ ḍiṁtalonĕ ninnu nem̐ḍu
sĕnagulu mainuṁḍam̐gā sigguna lom̐gudurā