Gussaa rangayya komcham taggayya

గుస్సా రంగయ్య కొంచం తగ్గయ్య
Year
Language

పల్లవి:

గుస్సా రంగయ్య... కొంచం తగ్గయ్య
కోపం మనిషికి ఎగ్గయ్యా..
గుస్సా రంగయ్య.. కొంచం తగ్గయ్య...
కోపం మనిషికి ఎగ్గయ్యా..
ఈ లోకం మారేది కాదు..
ఈ శోకాలు తీరేవి కావు..
ఈ లోకం మారేది కాదు..
ఈ శోకాలు తీరేవి కావు..
దోర పాకాన వున్నాను నేను
కొత్త లోకాన్ని నాలోన చూడు

గుస్సా రంగయ్య... కొంచం తగ్గయ్య
కోపం మనిషికి ఎగ్గయ్యా..

చరణం 1:

దేశాన్ని దోచేటి ఆసాములున్నారు..ఊ..
దేవుణ్ణి దిగమింగు పూజారులున్నారు..ఊ...
ప్రాణాలతో ఆడు వ్యాపారులున్నారు..ఊ...
మనిషికీ మంచికీ సమాధి కట్టారు..ఊ...

మహాత్ములెందరు సహాయ పడిన మంచి జరగ లేదు..
మహాత్ములెందరు సహాయ పడిన మంచి జరగ లేదు...
జాతివైద్యులే కోత కోసినా నీతి బ్రతకలేదు...
భోగాలు వెతుకాడు వయసు..
అనురాగాల జతి పాడు మనసు..
నీ దాహాని కనువైన సొగసు...
నీ సొంతాన్ని చేస్తుంది పడుచు...

ఆ..గుస్సా రంగయ్య... కొంచం తగ్గయ్య
కోపం మనిషికి ఎగ్గయ్యా..

చరణం 2:

ఆ...కాటుకెట్టిన కళ్ళలో కైపులున్నవి..ఈ..
మల్లెలెట్టిన కురులలో మాపులున్నవి..ఈ...
వన్నె తేరిన కన్నెలో చిన్నెలున్నవి..ఈ...
అన్ని నీవే అనుటకు రుజువులున్నవి..ఈ...

చక్కని చుక్కా సరసనుండగ పక్క చూపు లేల..
చక్కని చుక్కా సరసనుండగ పక్క చూపు లేల..
బాగుపడని ఈ లోకం కోసం బాధ పడేదేల..
మోహాన్ని రేపింది రేయి..
మన పేగుల్లో వుందోయి హాయి...
ఈ అందానికందివ్వు చేయి...
ఆనందాల బంధాలు వేయి...

గుస్సా రంగయ్య... కొంచం తగ్గయ్య
కోపం మనిషికి ఎగ్గయ్యా..

pallavi:

gussā raṁgayya... kŏṁchaṁ taggayya
kobaṁ maniṣhigi ĕggayyā..
gussā raṁgayya.. kŏṁchaṁ taggayya...
kobaṁ maniṣhigi ĕggayyā..
ī logaṁ māredi kādu..
ī śhogālu tīrevi kāvu..
ī logaṁ māredi kādu..
ī śhogālu tīrevi kāvu..
dora pāgāna vunnānu nenu
kŏtta logānni nālona sūḍu

gussā raṁgayya... kŏṁchaṁ taggayya
kobaṁ maniṣhigi ĕggayyā..

saraṇaṁ 1:

deśhānni doseḍi āsāmulunnāru..ū..
devuṇṇi digamiṁgu pūjārulunnāru..ū...
prāṇālado āḍu vyābārulunnāru..ū...
maniṣhigī maṁchigī samādhi kaṭṭāru..ū...

mahātmulĕṁdaru sahāya paḍina maṁchi jaraga ledu..
mahātmulĕṁdaru sahāya paḍina maṁchi jaraga ledu...
jādivaidyule koda kosinā nīdi bradagaledu...
bhogālu vĕdugāḍu vayasu..
anurāgāla jadi pāḍu manasu..
nī dāhāni kanuvaina sŏgasu...
nī sŏṁtānni sestuṁdi paḍusu...

ā..gussā raṁgayya... kŏṁchaṁ taggayya
kobaṁ maniṣhigi ĕggayyā..

saraṇaṁ 2:

ā...kāḍugĕṭṭina kaḽḽalo kaibulunnavi..ī..
mallĕlĕṭṭina kurulalo mābulunnavi..ī...
vannĕ terina kannĕlo sinnĕlunnavi..ī...
anni nīve anuḍagu rujuvulunnavi..ī...

sakkani sukkā sarasanuṁḍaga pakka sūbu lela..
sakkani sukkā sarasanuṁḍaga pakka sūbu lela..
bāgubaḍani ī logaṁ kosaṁ bādha paḍedela..
mohānni rebiṁdi reyi..
mana pegullo vuṁdoyi hāyi...
ī aṁdānigaṁdivvu seyi...
ānaṁdāla baṁdhālu veyi...

gussā raṁgayya... kŏṁchaṁ taggayya
kobaṁ maniṣhigi ĕggayyā..