Guri gadavamgaraadu komma nee radulagunu

గురి గడవఁగరాదు కొమ్మ నీ రతులకును
Language

(॥పల్లవి॥)
గురి గడవఁగరాదు కొమ్మ నీ రతులకును
విరివైన రతులకు వేడుక లివి గురి

(॥గురి॥)
మచ్చికలకునుఁ బచ్చి మాఁటలే గురి
యిచ్చికపు మాఁటలకు యింపులు గురి
నచ్చుకొట్టే యింపులకు నవ్వులు గురి
అచ్చపు టింపులకును ఆసలు గురి

(॥గురి॥)
కూడే యాసలకుఁ జెనకు లివి గురి
జోడైన చెనకులకు చూపులు గురి
వాడిక చూపులకు వాసులు గురి
మేడెపు వాసులకును మెచ్చులు గురి

(॥గురి॥)
మునుకొన్న మెచ్చులకు మోవులు గురి
పెనగొన్న మోవులకు ప్రియాలు గురి
ననుపుఁ బ్రియాలకు వినయాలు గురి
వినయపు సతికి శ్రీవేకంటేశుఁడే గురి

(||pallavi||)
guri gaḍavam̐garādu kŏmma nī radulagunu
virivaina radulagu veḍuga livi guri

(||guri||)
machchigalagunum̐ bachchi mām̐ṭale guri
yichchigabu mām̐ṭalagu yiṁpulu guri
nachchugŏṭṭe yiṁpulagu navvulu guri
achchabu ṭiṁpulagunu āsalu guri

(||guri||)
kūḍe yāsalagum̐ jĕnagu livi guri
joḍaina sĕnagulagu sūbulu guri
vāḍiga sūbulagu vāsulu guri
meḍĕbu vāsulagunu mĕchchulu guri

(||guri||)
munugŏnna mĕchchulagu movulu guri
pĕnagŏnna movulagu priyālu guri
nanubum̐ briyālagu vinayālu guri
vinayabu sadigi śhrīvegaṁṭeśhum̐ḍe guri