పల్లవి:
గున్నమామిడీ కొమ్మమీద గూళ్ళు రెండుండేవి
గున్నమామిడీ కొమ్మమీద గూళ్ళు రెండుండేవి
ఒక గూటిలోన చిలకుండేది
ఒక గూటిలోన కోయిలుండేది
చరణం 1:
తీగలాగ అల్లిన చెలిమీ
తెగుతుందని దిగులుపడి
కొమ్మవిడిన ఆ జంట కొత్తగూడు చేరింది !!2!!
ఒక్కనాడు రామచిలక ఉక్కుడేగ నీడకు జడిసి
కోయిలతో చెప్పలేక గూడు విడిచిపోయింది
జోడు చెదిరి పోయింది
చరణం 2:
చిన్ని చిలక ఏదనీ కన్నతల్లి అడిగితే
కోయిలేమి బదులిస్తుంది
కుమిలి కుమిలి ఏడుస్తుంది !!2!!
కోనకోనలో తిరిగీ కొమ్మ కొమ్మనూ అడిగీ
కొదమ చిలక కనరాకుంటే
కోయిలగతి ఏమవుతుంది
గుండె పగిలి చస్తుంది..
pallavi:
gunnamāmiḍī kŏmmamīda gūḽḽu rĕṁḍuṁḍevi
gunnamāmiḍī kŏmmamīda gūḽḽu rĕṁḍuṁḍevi
ŏga gūḍilona silaguṁḍedi
ŏga gūḍilona koyiluṁḍedi
saraṇaṁ 1:
tīgalāga allina sĕlimī
tĕguduṁdani digulubaḍi
kŏmmaviḍina ā jaṁṭa kŏttagūḍu seriṁdi !!2!!
ŏkkanāḍu rāmasilaga ukkuḍega nīḍagu jaḍisi
koyilado sĕppalega gūḍu viḍisiboyiṁdi
joḍu sĕdiri poyiṁdi
saraṇaṁ 2:
sinni silaga edanī kannadalli aḍigide
koyilemi badulistuṁdi
kumili kumili eḍustuṁdi !!2!!
konagonalo tirigī kŏmma kŏmmanū aḍigī
kŏdama silaga kanarāguṁṭe
koyilagadi emavuduṁdi
guṁḍĕ pagili sastuṁdi..