Gumde saadugaa inninaallugaa(male)

గుండె చాటుగా ఇన్నినాళ్ళుగా(male)
Work
Year
Language

పల్లవి:

గుండె చాటుగా ఇన్నినాళ్ళుగా ఉన్న ఊహలన్నీ
ఉన్నపాటుగా హంసలేఖలై ఎగిరి వెళ్ళిపోనీ.. నిన్ను కలుసుకోనీ

గుండె చాటుగా ఇన్నినాళ్ళుగా ఉన్న ఊహలన్నీ
ఉన్నపాటుగా హంసలేఖలై ఎగిరి వెళ్ళిపోనీ... నిన్ను కలుసుకోనీ
నిన్ను కలుసుకోనీ... విన్నవించుకోనీ... ఇన్నాళ్ళ ఊసులన్నీ

చరణం 1:

నీలిమబ్బులో నిలిచిపోకలా..ఆ ఆ ...
నీలిమబ్బులో నిలిచిపోకలా నింగి రాగమాలా
నీలి ముసుగులో మెరుపుతీగల దాగి ఉండనేలా

కొమ్మకొమ్మలో పూలుగా దివిలోని వర్ణాలు వాలగా
కొమ్మకొమ్మలో పూలుగా దివిలోని వర్ణాలు వాలగా
ఆ ఇలకు రమ్మని చినుకు చెమ్మని చెలిమి కోరుకోనీ... నిన్ను కలుసుకోనీ

గుండె చాటుగా ఇన్నినాళ్ళుగా ఉన్న ఊహలన్నీ
ఉన్నపాటుగా హంసలేఖలై ఎగిరి వెళ్ళిపోనీ... నిన్ను కలుసుకోనీ
నిన్ను కలుసుకోనీ... విన్నవించుకోనీ... ఇన్నాళ్ల ఊసులన్నీ

చరణం 2:

రేయి దాటని రాణివాసమా.. ఆ ఆ ...
రేయి దాటని రాణివాసమా అందరాని తారా
నన్ను చేరగా దారి చూపనా రెండు చేతులారా

చెదిరిపోని చిరునవ్వుగా నా పెదవిపైన చిందాడగా
చెదిరిపోని చిరునవ్వుగా నా పెదవిపైన చిందాడగా
తరలిరమ్మని తళుకులిమ్మని తలపు తెలుపుకోనీ... నిన్ను కలుసుకోనీ

గుండె చాటుగా ఇన్నినాళ్ళుగా ఉన్న ఊహలన్నీ
ఉన్నపాటుగా హంసలేఖలై ఎగిరి వెళ్ళిపోనీ... నిన్ను కలుసుకోనీ
నిన్ను కలుసుకోనీ... విన్నవించుకోనీ... ఇన్నాళ్ల ఊసులన్నీ

pallavi:

guṁḍĕ sāḍugā innināḽḽugā unna ūhalannī
unnabāḍugā haṁsalekhalai ĕgiri vĕḽḽibonī.. ninnu kalusugonī

guṁḍĕ sāḍugā innināḽḽugā unna ūhalannī
unnabāḍugā haṁsalekhalai ĕgiri vĕḽḽibonī... ninnu kalusugonī
ninnu kalusugonī... vinnaviṁchugonī... innāḽḽa ūsulannī

saraṇaṁ 1:

nīlimabbulo nilisibogalā..ā ā ...
nīlimabbulo nilisibogalā niṁgi rāgamālā
nīli musugulo mĕrubudīgala dāgi uṁḍanelā

kŏmmagŏmmalo pūlugā diviloni varṇālu vālagā
kŏmmagŏmmalo pūlugā diviloni varṇālu vālagā
ā ilagu rammani sinugu sĕmmani sĕlimi korugonī... ninnu kalusugonī

guṁḍĕ sāḍugā innināḽḽugā unna ūhalannī
unnabāḍugā haṁsalekhalai ĕgiri vĕḽḽibonī... ninnu kalusugonī
ninnu kalusugonī... vinnaviṁchugonī... innāḽla ūsulannī

saraṇaṁ 2:

reyi dāḍani rāṇivāsamā.. ā ā ...
reyi dāḍani rāṇivāsamā aṁdarāni tārā
nannu seragā dāri sūbanā rĕṁḍu sedulārā

sĕdiriboni sirunavvugā nā pĕdavibaina siṁdāḍagā
sĕdiriboni sirunavvugā nā pĕdavibaina siṁdāḍagā
taralirammani taḽugulimmani talabu tĕlubugonī... ninnu kalusugonī

guṁḍĕ sāḍugā innināḽḽugā unna ūhalannī
unnabāḍugā haṁsalekhalai ĕgiri vĕḽḽibonī... ninnu kalusugonī
ninnu kalusugonī... vinnaviṁchugonī... innāḽla ūsulannī