Ghanumdavu neegemidaam gadama ledu

ఘనుఁడవు నీకేమిటాఁ గడమ లేదు
Language

(॥పల్లవి॥)
ఘనుఁడవు నీకేమిటాఁ గడమ లేదు
మనలో నిట్లనేల మరఁగెల్లాఁ బాసెను

(॥ఘనుఁ॥)
యెప్పటికి నీచిత్త మొటువలె వచ్చి వుండు
అప్పటికిఁ దగుమాఁట లాడేనేను
ఇప్పు డడుగదేరి మా ఇంటికి విచ్చేయవయ్య
చెప్పినట్టే సే సేను నీసేఁతలెల్లా దక్కెను

(॥ఘనుఁ॥)
యెవ్వతె పొందు సేసితి విదియును లోఁగొనేను
యివ్వల నీకెంత పంతమిచ్చే నేను
చివ్వన విసుకనేల శిర సించు కెత్తవయ్య
నవ్వినట్టే నవ్వేను నయము నీకాయను

(॥ఘనుఁ॥)
యెటువలె మెత్తువు నీ యిచ్చకమే సే సేను
యిటువలెఁ గూడితివి యియ్యకొంటిని
ఘటన శ్రీ వేంకటేశ కంటి నలమేల్మంగను
తటుకన మొక్కితిని తలఁపు లీడేరెను

(||pallavi||)
ghanum̐ḍavu nīgemiḍām̐ gaḍama ledu
manalo niṭlanela maram̐gĕllām̐ bāsĕnu

(||ghanum̐||)
yĕppaḍigi nīsitta mŏḍuvalĕ vachchi vuṁḍu
appaḍigim̐ dagumām̐ṭa lāḍenenu
ippu ḍaḍugaderi mā iṁṭigi vichcheyavayya
sĕppinaṭṭe se senu nīsem̐talĕllā dakkĕnu

(||ghanum̐||)
yĕvvadĕ pŏṁdu sesidi vidiyunu lom̐gŏnenu
yivvala nīgĕṁta paṁtamichche nenu
sivvana visuganela śhira siṁchu kĕttavayya
navvinaṭṭe navvenu nayamu nīgāyanu

(||ghanum̐||)
yĕḍuvalĕ mĕttuvu nī yichchagame se senu
yiḍuvalĕm̐ gūḍidivi yiyyagŏṁṭini
ghaḍana śhrī veṁkaḍeśha kaṁṭi nalamelmaṁganu
taḍugana mŏkkidini talam̐pu līḍerĕnu