గెలువరాదు నీమాయ కేరడము లేమాడేము
(॥పల్లవి॥)
గెలువరాదు నీమాయ కేరడము లేమాడేము
కలికి నింతటనైనఁ గరుణించవయ్య
(॥గెలు॥)
చెలితోఁ జుట్టమువలె సేసితివి మేలమేలు
వెలలేనిజాగారాలే వేగినంతాను
పలుమారుసుద్దలనే భ్రమలఁబెట్టితి విట్టె
కలలోనికూటములే కలిగినంతాను
(॥గెలు॥)
ఆనుక నిజమువలె నాడితివి మేలు మేలు
మాననిజోలిమాటలే మాపుదాఁకాను
సానఁబట్టి యాసలనే సంతోసాలు రేఁచితివి
వీనుల పండుగలే నిన్నంతాను
(॥గెలు॥)
పాడితివి పాటవలె బాసలేమేలమేలు
యేడలేని వొడఁబా ట్లెందాఁకాను
వీడెమిచ్చి కూడితి శ్రీవేంకటేశ యీసతిని
వాడికవలపులే వలసినంతాను
(||pallavi||)
gĕluvarādu nīmāya keraḍamu lemāḍemu
kaligi niṁtaḍanainam̐ garuṇiṁchavayya
(||gĕlu||)
sĕlidom̐ juṭṭamuvalĕ sesidivi melamelu
vĕlalenijāgārāle veginaṁtānu
palumārusuddalane bhramalam̐bĕṭṭidi viṭṭĕ
kalalonigūḍamule kaliginaṁtānu
(||gĕlu||)
ānuga nijamuvalĕ nāḍidivi melu melu
mānanijolimāḍale mābudām̐kānu
sānam̐baṭṭi yāsalane saṁtosālu rem̐sidivi
vīnula paṁḍugale ninnaṁtānu
(||gĕlu||)
pāḍidivi pāḍavalĕ bāsalemelamelu
yeḍaleni vŏḍam̐bā ṭlĕṁdām̐kānu
vīḍĕmichchi kūḍidi śhrīveṁkaḍeśha yīsadini
vāḍigavalabule valasinaṁtānu