(॥పల్లవి॥)
గరిమతో నిన్నిటాఁగల నీకు
బెరసిన నామీఁదఁ బ్రియమున్నదా
(॥గరి॥)
తనురోమరోమరంధ్రములను బ్రహ్మాండ-
జననసంహారవిచారములు
మనసున నీకివి మంత్రములై నన్నుఁ
గనుఁగొని కరుణించఁగలదా వేళ
(॥గరి॥)
కన్నుల శీతోష్ణకారణములు దోచి-
యున్నచంద్రుడు రవియును మించఁగా
నన్నుఁ బాయుచుఁగూడ నలిరేఁగనేకాక
యిన్నిటాఁ బనులు నీకిఁకఁ గలవా
(॥గరి॥)
కడలేనినీమేనఁ గలుగుదేవతలను
బడిబడిఁ బలుమారుఁ బలికింపుచు
విడువక ననుఁగూడి వేంకటేశ్వర నెత్త-
మడరి యాడఁగ నీకు నదనున్నదా
(||pallavi||)
garimado ninniḍām̐gala nīgu
bĕrasina nāmīm̐dam̐ briyamunnadā
(||gari||)
tanuromaromaraṁdhramulanu brahmāṁḍa-
jananasaṁhāravisāramulu
manasuna nīgivi maṁtramulai nannum̐
ganum̐gŏni karuṇiṁcham̐galadā veḽa
(||gari||)
kannula śhīdoṣhṇagāraṇamulu dosi-
yunnasaṁdruḍu raviyunu miṁcham̐gā
nannum̐ bāyusum̐gūḍa nalirem̐ganegāga
yinniḍām̐ banulu nīgim̐kam̐ galavā
(||gari||)
kaḍaleninīmenam̐ galugudevadalanu
baḍibaḍim̐ balumārum̐ baligiṁpusu
viḍuvaga nanum̐gūḍi veṁkaḍeśhvara nĕtta-
maḍari yāḍam̐ga nīgu nadanunnadā