Gadusavamtaa ninnu kanna vaarellaa naaderu

గడుసవంటా నిన్ను కన్న వారెల్లా నాడేరు
Language

(॥పల్లవి॥)
గడుసవంటా నిన్ను కన్న వారెల్లా నాడేరు
జడిగొని యాదరించఁగవద్దా నీవు

(॥గడు॥)
చెలఁగితొలుత నీతో సెలవుల నవ్వె నాకె
కలువపువ్వులవేసె కమ్మటి నాకె
పిలిచి పెదవులవే ప్రియములు చెప్పె నాకె
మెలఁగి యిఁ(యిం?) తటనైనా మెచ్చవద్దా నీవు

(॥గడు॥)
సారెకు మోవి చూపి చవులుసేసె నాపె
కూరిమి గొసరి గోరగీరె నాపె
ఆరీతి వేరుసేయకుమని విడెమిచ్చె నాపె
నీరతులఁ దనిపి మన్నించవద్దా నీవు

(॥గడు॥)
గక్కునఁ గాఁగిటఁ గూడి కడుఁ బచ్చిసేసె నాకె
లక్కవలెఁ గరఁగించి లాలించె నాకె
యెక్కువ శ్రీవేంకటేశ యేలితివినన్ను నిట్టె
నిక్కమును నీదయేనించవద్దా నీవు

(||pallavi||)
gaḍusavaṁṭā ninnu kanna vārĕllā nāḍeru
jaḍigŏni yādariṁcham̐gavaddā nīvu

(||gaḍu||)
sĕlam̐gidŏluda nīdo sĕlavula navvĕ nāgĕ
kaluvabuvvulavesĕ kammaḍi nāgĕ
pilisi pĕdavulave priyamulu sĕppĕ nāgĕ
mĕlam̐gi yim̐(yiṁ?) taḍanainā mĕchchavaddā nīvu

(||gaḍu||)
sārĕgu movi sūbi savulusesĕ nābĕ
kūrimi gŏsari goragīrĕ nābĕ
ārīdi veruseyagumani viḍĕmichchĕ nābĕ
nīradulam̐ danibi manniṁchavaddā nīvu

(||gaḍu||)
gakkunam̐ gām̐giḍam̐ gūḍi kaḍum̐ bachchisesĕ nāgĕ
lakkavalĕm̐ garam̐giṁchi lāliṁchĕ nāgĕ
yĕkkuva śhrīveṁkaḍeśha yelidivinannu niṭṭĕ
nikkamunu nīdayeniṁchavaddā nīvu