గాలి నింగి నీరు.. భూమి నిప్పు మీరు
పల్లవి:
గాలి నింగి నీరు.. భూమి నిప్పు మీరు
రామా.. వద్దనలేరా ఒకరూ..ఊ..
నేరం చేసిందెవరు? దూరం అవుతోందెవరు?
ఘోరం ఆపేదెవరు? ఎవరూ.. ఊ..
రారే మునులు ఋషులు..
ఏమైరి వేదాంతులు? సాగే ఈ మౌనం సరేనా..ఆ..
కొండ కోన అడవి.. సెలయేరు సరయూ నది..
అడగండి న్యాయం ఇదేనా..ఆ..?
గాలి నింగి నీరు.. భూమి నిప్పు మీరు
రామా.. వద్దనలేరా ఒకరూ..
చరణం 1:
ముక్కోటి దేవతలంత.. దీవించిన ఈ బంధం
ఇక్కడ ఇప్పుడు విడుతుంటే.. ఏ ఒక్కరు కూడా దిగిరారా
అందరికీ ఆదర్శం అని.. కీర్తించే ఈ లోకం
రాముని కోరగ పొలేదా.. ఈ రథముని ఆపగ లేదా
విధినైన కాని ఎదిరించేవాడే.. విధి లేక నేడు విలపించినాడే
ఏడేడు లోకాలకి సోకేను ఈ శోకం..
గాలి నింగి నీరు.. భూమి నిప్పు మీరు
రామా.. వద్దనలేరా ఒకరూ..
చరణం 2:
అక్కడితో అయిపోకుండా.. ఇక్కడ ఆ ఇల్లాలే
రక్కసి విధికి చిక్కిందా.. ఈ లెక్కన దైవం ఉందా
సుగుణంతో సుర్యుని వంశం.. వెలిగించే కులసతిని
ఆ వెలుగే వెలివేసిందా.. ఈ జగమే చీకటి అయ్యిందా
ఏ తప్పు లేని ఈ ముప్పు ఏమి.. కాపాడలేరా ఎవరైన కాని
నీ మాటే నీదా.. వేరే దారే ఏది లేదా
నేరం చేసిందెవరు.. దూరం అవుతోందెవరు
ఘోరం ఆపెదెవరు.. ఎవరూ..ఊ..
రారే మునులు ఋషులు.. ఏమైరి వేదాంతులు
అడగండి న్యాయం.. ఇదేనా..ఆ..
గాలి నింగి నీరు.. భూమి నిప్పు మీరు
రామా.. వద్దనలేరా ఒకరూ..
pallavi:
gāli niṁgi nīru.. bhūmi nippu mīru
rāmā.. vaddanalerā ŏgarū..ū..
neraṁ sesiṁdĕvaru? dūraṁ avudoṁdĕvaru?
ghoraṁ ābedĕvaru? ĕvarū.. ū..
rāre munulu ṛṣhulu..
emairi vedāṁtulu? sāge ī maunaṁ sarenā..ā..
kŏṁḍa kona aḍavi.. sĕlayeru sarayū nadi..
aḍagaṁḍi nyāyaṁ idenā..ā..?
gāli niṁgi nīru.. bhūmi nippu mīru
rāmā.. vaddanalerā ŏgarū..
saraṇaṁ 1:
mukkoḍi devadalaṁta.. dīviṁchina ī baṁdhaṁ
ikkaḍa ippuḍu viḍuduṁṭe.. e ŏkkaru kūḍā digirārā
aṁdarigī ādarśhaṁ ani.. kīrdiṁche ī logaṁ
rāmuni koraga pŏledā.. ī rathamuni ābaga ledā
vidhinaina kāni ĕdiriṁchevāḍe.. vidhi lega neḍu vilabiṁchināḍe
eḍeḍu logālagi sogenu ī śhogaṁ..
gāli niṁgi nīru.. bhūmi nippu mīru
rāmā.. vaddanalerā ŏgarū..
saraṇaṁ 2:
akkaḍido ayiboguṁḍā.. ikkaḍa ā illāle
rakkasi vidhigi sikkiṁdā.. ī lĕkkana daivaṁ uṁdā
suguṇaṁto suryuni vaṁśhaṁ.. vĕligiṁche kulasadini
ā vĕluge vĕlivesiṁdā.. ī jagame sīgaḍi ayyiṁdā
e tappu leni ī muppu emi.. kābāḍalerā ĕvaraina kāni
nī māḍe nīdā.. vere dāre edi ledā
neraṁ sesiṁdĕvaru.. dūraṁ avudoṁdĕvaru
ghoraṁ ābĕdĕvaru.. ĕvarū..ū..
rāre munulu ṛṣhulu.. emairi vedāṁtulu
aḍagaṁḍi nyāyaṁ.. idenā..ā..
gāli niṁgi nīru.. bhūmi nippu mīru
rāmā.. vaddanalerā ŏgarū..