గాడిదెఁ గూయకుండఁ గంసుఁడెఱఁగకుండ
(॥పల్లవి॥)
గాడిదెఁ గూయకుండఁ గంసుఁడెఱఁగకుండ
వేడుక వసుదేవునకు విన్నవించరో
(॥గాడి॥)
దేవతలు జయవెట్ట దేవకి గర్భమునందు
యీవేళ నేనుగబిడ్డఁ డిదె జనించె
పూపులవాన గురిసె భూభార మెల్లఁ ధీరె
వేవేగ నొజ్జళ్లు వేళ చూడరో
(॥గాడి॥)
అద్దమరాతిరికాడ నటు చంద్రొదయముతో
వొద్దికఁ గృష్ణుఁడు వుట్టె నోచెలులాల
సుద్దులెల్లఁ జెప్పఁజోచ్చెఁజూపె నాల్గుచేతులవె
పొద్దున సోబన మిట్టె పొలఁతులు సేయరో
(॥గాడి॥)
సంకుజక్రములు వట్టి సాదుల నిందరిఁ గావ
తెంకినే శ్రీవేంకటాద్రిదేవుఁడు వుట్టె
కొంకుఁబనులెల్లాఁ దేరె కోరి తొట్టెలఁ బెట్టరే
లంకె బలభద్రుతోడ లలనలు వెంచరో
(||pallavi||)
gāḍidĕm̐ gūyaguṁḍam̐ gaṁsum̐ḍĕṟam̐gaguṁḍa
veḍuga vasudevunagu vinnaviṁcharo
(||gāḍi||)
devadalu jayavĕṭṭa devagi garbhamunaṁdu
yīveḽa nenugabiḍḍam̐ ḍidĕ janiṁchĕ
pūbulavāna gurisĕ bhūbhāra mĕllam̐ dhīrĕ
vevega nŏjjaḽlu veḽa sūḍaro
(||gāḍi||)
addamarādirigāḍa naḍu saṁdrŏdayamudo
vŏddigam̐ gṛṣhṇum̐ḍu vuṭṭĕ nosĕlulāla
suddulĕllam̐ jĕppam̐jochchĕm̐jūbĕ nālgusedulavĕ
pŏdduna sobana miṭṭĕ pŏlam̐tulu seyaro
(||gāḍi||)
saṁkujakramulu vaṭṭi sādula niṁdarim̐ gāva
tĕṁkine śhrīveṁkaḍādridevum̐ḍu vuṭṭĕ
kŏṁkum̐banulĕllām̐ derĕ kori tŏṭṭĕlam̐ bĕṭṭare
laṁkĕ balabhadrudoḍa lalanalu vĕṁcharo