Evvarumde reṟamgaru yeduda sigguvadavu

ఎవ్వరుండే రెఱఁగరు యెదుట సిగ్గువడవు
Language

(॥పల్లవి॥)
ఎవ్వరుండే రెఱఁగరు యెదుట సిగ్గువడవు
పువ్వులనే వేసేవు పూఁచి పూఁచి

(॥ఎవ్వ॥)
వెస నాపెమాటలు వినవేడుకయ్యీనో
కొసరుచు నడిగేవు కొచ్చి కొచ్చి
యెసగ మోముచూడ నేఁకటతో నున్నాడవో
ముసుఁగువట్టి తీసేవు ముంచి ముంచి

(॥ఎవ్వ॥)
మలసి సరసమాడ మనసాయనో నీకు
కెలయుచు నవ్వేవు కేరికేరి
చలివాసి మోవితేనే చవి నీకుఁ బుట్టెనో
పొలయుచు వేఁడేవు పొంచి పొంచి

(॥ఎవ్వ॥)
అట్టె యాపె చన్నులపై ఆస నీకుఁ బుట్టెనో
గుట్టుతోడఁ గొలచేవు కోరి కోరి
నెట్టన శ్రీవేంకటేశ నేడలమేల్మంగ యాకె -
నిట్టె కూడి నన్నేలితి వెంచి యెంచి

(||pallavi||)
ĕvvaruṁḍe rĕṟam̐garu yĕduḍa sigguvaḍavu
puvvulane vesevu pūm̐si pūm̐si

(||ĕvva||)
vĕsa nābĕmāḍalu vinaveḍugayyīno
kŏsarusu naḍigevu kŏchchi kŏchchi
yĕsaga momusūḍa nem̐kaḍado nunnāḍavo
musum̐guvaṭṭi tīsevu muṁchi muṁchi

(||ĕvva||)
malasi sarasamāḍa manasāyano nīgu
kĕlayusu navvevu kerigeri
salivāsi movidene savi nīgum̐ buṭṭĕno
pŏlayusu vem̐ḍevu pŏṁchi pŏṁchi

(||ĕvva||)
aṭṭĕ yābĕ sannulabai āsa nīgum̐ buṭṭĕno
guṭṭudoḍam̐ gŏlasevu kori kori
nĕṭṭana śhrīveṁkaḍeśha neḍalamelmaṁga yāgĕ -
niṭṭĕ kūḍi nannelidi vĕṁchi yĕṁchi