ఎవ్వరు వెంగెములాడనేల నిన్నును
(॥పల్లవి॥)
ఎవ్వరు వెంగెములాడనేల నిన్నును
వువ్విళ్లూర సంతోసాన నుండుదువుగాక
(॥ఎవ్వ॥)
మగువ తేనెలుగార మాటలాడితే నీకు
తెగనిరతులతరితీపు లౌఁగాక
నిగనిగనిమోవి వెన్నెలనవ్వు నవ్వితేను
అగపడి కడుఁజల్లనౌఁగాక నీమనసు
(॥ఎవ్వ॥)
సుదతి తమ్మిరేకుల చూపుల నిన్నుఁ జూచితే
కొదలే కింపు గుబులుకొనుఁగాక
అదనఁ జెమటలతో ఆపె నీపాదా లొత్తితే
కదిసి తనివిఁబొందుగాక నీతనువు
(॥ఎవ్వ॥)
చెలియ తీగెలవంటిచేతులఁ గాఁగిలించితే
బలువలపులపంట వండుఁగాక
యెలమి శ్రీవేంకటేశ యే నలమేలుమంగను
నెలవై నన్నేలితివి నిండుఁగాక కరుణ
(||pallavi||)
ĕvvaru vĕṁgĕmulāḍanela ninnunu
vuvviḽlūra saṁtosāna nuṁḍuduvugāga
(||ĕvva||)
maguva tenĕlugāra māḍalāḍide nīgu
tĕganiraduladaridību laum̐gāga
niganiganimovi vĕnnĕlanavvu navvidenu
agabaḍi kaḍum̐jallanaum̐gāga nīmanasu
(||ĕvva||)
sudadi tammiregula sūbula ninnum̐ jūside
kŏdale kiṁpu gubulugŏnum̐gāga
adanam̐ jĕmaḍalado ābĕ nībādā lŏttide
kadisi tanivim̐bŏṁdugāga nīdanuvu
(||ĕvva||)
sĕliya tīgĕlavaṁṭisedulam̐ gām̐giliṁchide
baluvalabulabaṁṭa vaṁḍum̐gāga
yĕlami śhrīveṁkaḍeśha ye nalamelumaṁganu
nĕlavai nannelidivi niṁḍum̐gāga karuṇa