Evvaru neruduru nem diduvamti nerubulu

ఎవ్వరు నేరుతురు నేఁ డిటువంటి నేరుపులు
Language

(॥పల్లవి॥)
ఎవ్వరు నేరుతురు నేఁ డిటువంటి నేరుపులు
నివ్వటిల్లుఁ జేఁతలను నిన్నే మెప్పించేను

(॥ఎవ్వ॥)
చెక్కుచెమట దుడిచె చెలి సురటి విసరె
వెక్కసమై నీ కెంత వేడుకాయనో
చక్క వద్దఁగూచుండి జారినతురుము దిద్దె
మకుకవ నీవలపులు మానుపఁగవసమా

(॥ఎవ్వ॥)
వొంటినే కొలువుసుసె వొయ్యనే పాదము లొత్తె
పెంటలుగా నీకెంట ప్రియమాయెనో
అంటిముట్టి పెనఁగుతూ నాయములు గరఁగించె
వెంటనే యీవోజ లిఁక విడపించవసమా

(॥ఎవ్వ॥)
సారెకు పయ్యదఁ గప్పె సంగడినే మాటలాడె
కోరిక నీకెటువలెఁ గూడెనో నేఁడు
గారవించి శ్రీవేంకటేశ నన్నేలితివి
తారుకాణనీసుద్దులు దాఁచ నిఁక వసమా

(||pallavi||)
ĕvvaru neruduru nem̐ ḍiḍuvaṁṭi nerubulu
nivvaḍillum̐ jem̐talanu ninne mĕppiṁchenu

(||ĕvva||)
sĕkkusĕmaḍa duḍisĕ sĕli suraḍi visarĕ
vĕkkasamai nī kĕṁta veḍugāyano
sakka vaddam̐gūsuṁḍi jārinadurumu diddĕ
magugava nīvalabulu mānubam̐gavasamā

(||ĕvva||)
vŏṁṭine kŏluvususĕ vŏyyane pādamu lŏttĕ
pĕṁṭalugā nīgĕṁṭa priyamāyĕno
aṁṭimuṭṭi pĕnam̐gudū nāyamulu garam̐giṁchĕ
vĕṁṭane yīvoja lim̐ka viḍabiṁchavasamā

(||ĕvva||)
sārĕgu payyadam̐ gappĕ saṁgaḍine māḍalāḍĕ
koriga nīgĕḍuvalĕm̐ gūḍĕno nem̐ḍu
gāraviṁchi śhrīveṁkaḍeśha nannelidivi
tārugāṇanīsuddulu dām̐sa nim̐ka vasamā