ఎవ్వరు మంచివారమో ఇప్పుడు నీకు
(॥పల్లవి॥)
ఎవ్వరు మంచివారమో ఇప్పుడు నీకు
పువ్వువలె నాకు నీవు బుద్దిచెప్పవయ్యా
(॥॥)
బత్తితోఁ బాదము లోత్తి బాగాలు చేతికిచ్చి
చిత్తమురా సేవలెల్లాఁ జేసీ నాపె
కొత్త కొత్త మాటలాడి కొంగు వట్టి తీసి నిన్ను
గుత్తపు గుబ్బల నూఁది గునిసేము నేము
(॥॥)
అంగములు సోఁకించి అట్టె మోవి చవిచూపి
చెంగటనే కాఁపిరము సేసీ నాపె
జంగిలి దూరులు దూరి జంకెన బొమ్మలు చూపి
వెంగెములనే సడిమేసేము నేము
(॥॥)
చనవునఁ గాఁగిలించి చాయలు సన్నలుఁ జేసి
యెనసీ శ్రీవెంకటేశ యెదుట నాపె
ననుపుల నిన్నుఁగూడి నవ్వుతానే గోర గీరి
చెనకి రతుల ఘాతసేసేము నేము
(||pallavi||)
ĕvvaru maṁchivāramo ippuḍu nīgu
puvvuvalĕ nāgu nīvu buddisĕppavayyā
(||||)
battidom̐ bādamu lotti bāgālu sedigichchi
sittamurā sevalĕllām̐ jesī nābĕ
kŏtta kŏtta māḍalāḍi kŏṁgu vaṭṭi tīsi ninnu
guttabu gubbala nūm̐di gunisemu nemu
(||||)
aṁgamulu som̐kiṁchi aṭṭĕ movi savisūbi
sĕṁgaḍane kām̐piramu sesī nābĕ
jaṁgili dūrulu dūri jaṁkĕna bŏmmalu sūbi
vĕṁgĕmulane saḍimesemu nemu
(||||)
sanavunam̐ gām̐giliṁchi sāyalu sannalum̐ jesi
yĕnasī śhrīvĕṁkaḍeśha yĕduḍa nābĕ
nanubula ninnum̐gūḍi navvudāne gora gīri
sĕnagi radula ghādasesemu nemu