Evvaroo nemi sepperu imtadi naayagumdavu

ఎవ్వరూ నేమి చెప్పేరు ఇంతడి నాయకుఁడవు
Language

(॥పల్లవి॥)
ఎవ్వరూ నేమి చెప్పేరు ఇంతడి నాయకుఁడవు
రవ్వగా నీవే తెలిసి రక్షింతువుకాక

(॥ఎవ్వ॥)
వలచితినంటాను వనిత చెప్పుకొనునా
సలిగె ఇచ్చితివంటా సాదించునా
తలఁ పెరుఁగుదునని తమకించి కొసరునా
చెలియ నేలేది నీచేతి దింతేకాక

(॥ఎవ్వ॥)
కాయము సోఁకినంతనే కాంత గర్వించునా
పాయపుదాననని పంతమాడునా
చేయి నీవు వేసితేనే చిరునవ్వు నవ్వునా
ఆయింతివేడుకలు నీయాస యింతేకాక

(॥ఎవ్వ॥)
చక్కనిదియైతేనే సతి నిన్ను జంకించునా
వెక్కసాన మెచ్చితేనే విఱ్ఱవీఁగునా
యిక్కడ శ్రీవేంకటేశ యీకె యలమేలుమంగ
వొక్కటైతి విదెల్లా నీ వోపి కింతేకాక

(||pallavi||)
ĕvvarū nemi sĕpperu iṁtaḍi nāyagum̐ḍavu
ravvagā nīve tĕlisi rakṣhiṁtuvugāga

(||ĕvva||)
valasidinaṁṭānu vanida sĕppugŏnunā
saligĕ ichchidivaṁṭā sādiṁchunā
talam̐ pĕrum̐gudunani tamagiṁchi kŏsarunā
sĕliya neledi nīsedi diṁtegāga

(||ĕvva||)
kāyamu som̐kinaṁtane kāṁta garviṁchunā
pāyabudānanani paṁtamāḍunā
seyi nīvu vesidene sirunavvu navvunā
āyiṁtiveḍugalu nīyāsa yiṁtegāga

(||ĕvva||)
sakkanidiyaidene sadi ninnu jaṁkiṁchunā
vĕkkasāna mĕchchidene viṭravīm̐gunā
yikkaḍa śhrīveṁkaḍeśha yīgĕ yalamelumaṁga
vŏkkaḍaidi vidĕllā nī vobi kiṁtegāga