Evvarivaamdavu neevu yiddarim doyamgaraadu

ఎవ్వరివాఁడవు నీవు యిద్దరిఁ దోయఁగరాదు
Language

(॥పల్లవి॥)
ఎవ్వరివాఁడవు నీవు యిద్దరిఁ దోయఁగరాదు
పవ్వళించవయ్యా ఇటె పాపము రాకుండాను

(॥ఎవ్వ॥)
పాదపుటందెలు మ్రోయ పడిఁతి నిన్నుఁ గంటానే
అదిగొని వచ్చె నీపై ఆస యెట్టిదో
ఆదెస వేరొకతె నిన్నట్టె యింటికి రమ్మంటా
గోదిలి కొసరుచును కంగువట్టి తీసెను

(॥ఎవ్వ॥)
కదలు గుచాలతోడ గందము గస్తూరి నీకు
సుదతి అందిచ్చె నెంత చుట్టరికమో
అదనెరిగి వొకతె అట్టె పూవు లియ్యవచ్చి
చెదరకుండాఁ బట్టి చేతులపై మొక్కెను

(॥ఎవ్వ॥)
తొరలిపట్టె నొకతె తురుముచెదర నిన్ను
గరిమ శ్రీవేంకేటేశ రదలుమని
బెరసి నాబోఁటి దిట్టె ప్రియమునఁ బనఁగెను
మురిపేనఁ గూడితిని మొగమోడవలసె

(||pallavi||)
ĕvvarivām̐ḍavu nīvu yiddarim̐ doyam̐garādu
pavvaḽiṁchavayyā iḍĕ pābamu rāguṁḍānu

(||ĕvva||)
pādabuḍaṁdĕlu mroya paḍim̐ti ninnum̐ gaṁṭāne
adigŏni vachchĕ nībai āsa yĕṭṭido
ādĕsa verŏgadĕ ninnaṭṭĕ yiṁṭigi rammaṁṭā
godili kŏsarusunu kaṁguvaṭṭi tīsĕnu

(||ĕvva||)
kadalu gusāladoḍa gaṁdamu gastūri nīgu
sudadi aṁdichchĕ nĕṁta suṭṭarigamo
adanĕrigi vŏgadĕ aṭṭĕ pūvu liyyavachchi
sĕdaraguṁḍām̐ baṭṭi sedulabai mŏkkĕnu

(||ĕvva||)
tŏralibaṭṭĕ nŏgadĕ turumusĕdara ninnu
garima śhrīveṁkeḍeśha radalumani
bĕrasi nābom̐ṭi diṭṭĕ priyamunam̐ banam̐gĕnu
muribenam̐ gūḍidini mŏgamoḍavalasĕ