ఎవ్వరిఁ బోలుదు నేను యిందరిలోన
(॥పల్లవి॥)
ఎవ్వరిఁ బోలుదు నేను యిందరిలోన
నివ్వటిల్ల నా భాగ్యము నీ చిత్తముగాక
(॥॥)
కందువఁ బెక్కుసతులు గలుగఁగా నీమీఁ ద
సందడిఁ బడె వలపు సారెసారెకు
అందరు నీతో మాఁటలాడఁ గా నాడఁ గాను
అందందె గుత్తులుగట్టె నాడీ ముచ్చటలు
(॥॥)
చెలరేఁగి వారు వారిచేతులు చాఁచఁ గాను
కలగూరవలె నాయ కాఁగిటిరతి
సొలసి యప్పటిఁ దాము చూడఁగఁ జూడఁ గాను
పిలువనిపేరటమై పిరిగొనె వేడుక
(॥॥)
సరి నిన్నిందరుఁ గూడి జాణతనాలాడఁ గాను
గరివడె నవ్వులెల్లాఁ గడుఁ గడును
పరగ నలమేల్ మంగపతివి శ్రీవేంకటేశ
నిరతి నన్నేలఁ గాను నిండెను సోబనము
(||pallavi||)
ĕvvarim̐ boludu nenu yiṁdarilona
nivvaḍilla nā bhāgyamu nī sittamugāga
(||||)
kaṁduvam̐ bĕkkusadulu galugam̐gā nīmīm̐ da
saṁdaḍim̐ baḍĕ valabu sārĕsārĕgu
aṁdaru nīdo mām̐ṭalāḍam̐ gā nāḍam̐ gānu
aṁdaṁdĕ guttulugaṭṭĕ nāḍī muchchaḍalu
(||||)
sĕlarem̐gi vāru vārisedulu sām̐sam̐ gānu
kalagūravalĕ nāya kām̐giḍiradi
sŏlasi yappaḍim̐ dāmu sūḍam̐gam̐ jūḍam̐ gānu
piluvaniberaḍamai pirigŏnĕ veḍuga
(||||)
sari ninniṁdarum̐ gūḍi jāṇadanālāḍam̐ gānu
garivaḍĕ navvulĕllām̐ gaḍum̐ gaḍunu
paraga nalamel maṁgabadivi śhrīveṁkaḍeśha
niradi nannelam̐ gānu niṁḍĕnu sobanamu