ఎవ్వరికిఁ జెప్పేవే యీ సుద్దులు
(॥పల్లవి॥)
ఎవ్వరికిఁ జెప్పేవే యీ సుద్దులు
నవ్వు వచ్చీ నిన్నుఁ జూచి నాకు నాకే యిపుడు
(॥ఎవ్వ॥)
చనవరిదానపు సముకానఁ బతికి నీ -
మనవులు చెప్పేవు మాటిమాటికి
పనిగల దానవు పాదాలు పట్టుకొని
పెనఁగే వాతనితోను పెద్దరికమునను
(॥ఎవ్వ॥)
సందుసుడిదానవు చప్పన వుప్పన చేసి
విందులు చెప్పవచ్చేవు విభునికిని
పొందుగలదానవు పూనుకవాసుకవచ్చి
గందము వూసేవు మేన కడు బత్తితోను
(॥ఎవ్వ॥)
చుట్టరికపు దానవు సొలసి కాఁగిలించేవు
యిట్టే నీవు శ్రీవేంకటేశ్వరుని
వట్టూడిగపుదానవు వడి నన్ను నీతఁడేలె
మట్టుమీరి మెచ్చేవు మాకు నితవరివి
(||pallavi||)
ĕvvarigim̐ jĕppeve yī suddulu
navvu vachchī ninnum̐ jūsi nāgu nāge yibuḍu
(||ĕvva||)
sanavaridānabu samugānam̐ badigi nī -
manavulu sĕppevu māḍimāḍigi
panigala dānavu pādālu paṭṭugŏni
pĕnam̐ge vādanidonu pĕddarigamunanu
(||ĕvva||)
saṁdusuḍidānavu sappana vuppana sesi
viṁdulu sĕppavachchevu vibhunigini
pŏṁdugaladānavu pūnugavāsugavachchi
gaṁdamu vūsevu mena kaḍu battidonu
(||ĕvva||)
suṭṭarigabu dānavu sŏlasi kām̐giliṁchevu
yiṭṭe nīvu śhrīveṁkaḍeśhvaruni
vaṭṭūḍigabudānavu vaḍi nannu nīdam̐ḍelĕ
maṭṭumīri mĕchchevu māgu nidavarivi